AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSP Ravi Bishnoi : ఏరా.. సెల్యూట్ కొట్టవా?.. లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు

DSP Ravi Bishnoi : రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల క్రీడా కోటాలో డీఎస్పీగా నియమించింది. ఈ హోదా దక్కిన తర్వాత తొలిసారి తన స్నేహితుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు ఆకాష్ సింగ్‌ను బిష్ణోయ్ కలిశాడు.

DSP Ravi Bishnoi : ఏరా.. సెల్యూట్ కొట్టవా?.. లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
Dsp Ravi Bishnoi
Rakesh
|

Updated on: Apr 22, 2026 | 4:23 PM

Share

DSP Ravi Bishnoi : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అయితే మైదానంలో ఈ రెండు జట్లు తలపడకముందే, బయట ఒక ఆసక్తికరమైన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, లక్నో ప్లేయర్ ఆకాష్ సింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా డిఎస్పీ హోదాలో ఉన్న బిష్ణోయ్ చూపించిన అవతారం వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగింది?

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల క్రీడా కోటాలో డీఎస్పీగా నియమించింది. ఈ హోదా దక్కిన తర్వాత తొలిసారి తన స్నేహితుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు ఆకాష్ సింగ్‌ను బిష్ణోయ్ కలిశాడు. రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన వీడియోలో.. ఆకాష్ సింగ్ వచ్చి బిష్ణోయ్‌ను చూడగానే అరేయ్.. డీఎస్పీ అయిపోయావుగా అని అంటూ ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు బిష్ణోయ్ నవ్వుతూ.. “ఏరా.. డీఎస్పీని చూసి సెల్యూట్ కొట్టవా?” అంటూ సరదాగా గదమాయించాడు. దీంతో ఆకాష్ వెంటనే చిరునవ్వుతో బిష్ణోయ్‌కు సెల్యూట్ చేయడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్

ఈ సరదా ముచ్చట్లు పక్కన పెడితే, పాయింట్ల పట్టికలో మాత్రం పరిస్థితి సీరియస్‌గానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 4 గెలిచి, 2 ఓడిపోయి టేబుల్‌లో 4వ స్థానంలో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్, ఈ మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆరు మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి, 4 ఓటములతో 9వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. లక్నో తన సొంత గడ్డపై ఈ మ్యాచ్ గెలిచి తన గ్రాఫ్‌ను పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.

స్టార్ ప్లేయర్ల ఫామ్

రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి వారు ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. అయితే బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో లక్నో బ్యాటర్లను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. లక్నో జట్టులో కెఎల్ రాహుల్ ఫామ్ మీద విమర్శలు వస్తున్న తరుణంలో, ఈ మ్యాచ్ వారికి డూ ఆర్ డై లాంటిది. ప్రాక్టీస్ సెషన్లలో ఇరు జట్ల ఆటగాళ్లు చమటోడ్చుతున్నారు.

సోషల్ మీడియాలో రెస్పాన్స్

రాజస్థాన్ రాయల్స్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ సాధించింది. “గ్రౌండ్లో ప్లేయర్.. బయట పోలీస్.. బిష్ణోయ్ ఇస్ ఆల్ రౌండర్” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండటం క్రికెట్ స్పిరిట్‌కు నిదర్శనమని క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us