మే 23 నుంచి పూణెలోని MCA స్టేడియంలో ప్రారంభమయ్యే మహిళల టీ20 ఛాలెంజ్(Womens T20 Challenge)కు సంబంధించిన మూడు జట్లను ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్‌ని సూపర్‌నోవాస్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన ట్రైల్‌బ్లేజర్స్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే సమయంలో వెలాసిటీ జట్టు కెప్టెన్‌గా దీప్తి శర్మ ఎంపికైంది. మరోవైపు వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామికి ఏ జట్టులోనూ అవకాశం దక్కలేదు. రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరికి రెస్ట్ ఇచ్చారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు టోర్నమెంట్‌లో ఆడబోతున్నారు. ఈసారి టోర్నీలో మొత్తం 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరుగుతుంది. అలాగే ఫైనల్ మే 28న జరుగుతుంది.
అంతర్జాతీయ స్టార్లలో డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, సల్మా ఖాటూన్, షర్మిమ్ అక్తర్, లారా వోల్వార్డ్ట్, కేథరీన్ క్రాస్, అయాబొంగా ఖాకా వంటి క్రీడాకారులు ఆడుతున్నారు. అదే సమయంలో సోఫీ బ్రౌన్, థాయ్‌లాండ్ ప్లేయర్ నాథ్‌కన్ చట్టమ్‌లకు కూడా టోర్నీలో అవకాశం దక్కింది.
సూపర్‌నోవాస్ టీం..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా, ఎలెనా కింగ్, ఆయుష్ సోని, చందు వి, డియాండ్రా డోటిన్, హర్లీన్ డియోల్. మేఘనా సింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూనియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, స్యూ లూస్, మాన్సీ జోషి.
ట్రైల్‌బ్లేజర్ టీం..
స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాటూన్, షర్మిమ్ అక్తర్, సుజాబియా బ్రౌన్, సుజాబియా మలీక్. పోఖార్కర్.
వెలాసిటీ టీం..
దీప్తి శర్మ, స్నేహ రానా, షెఫాలీ వర్మ, ఈయబొంగా ఖాకా, కెపి. నవ్‌గిరే, కేథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వాల్‌వార్డ్, మాయా సోనావానే, నత్కల్ ఛంతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదార్, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, యాస్తిక భాటియా, ప్రణవి చంద్ర.
మహిళల టీ20 ఛాలెంజ్ షెడ్యూల్..
మహిళల టీ20 ఛాలెంజ్‌లో ఒక్కో జట్టు 2 మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు డే-నైట్‌గా ఉంటాయి. మే 23న రాత్రి 7.30 గంటలకు ట్రైల్‌బ్లేజర్స్, సూపర్‌నోవాస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మే 24న సూపర్‌నోవాస్ వర్సెస్0 వెలాసిటీ ఢీకొంటాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనుంది. మే 26న రాత్రి 7.30 గంటలకు వెలాసిటీ వర్సెస్ ట్రైల్‌బ్లేజర్స్ తలపడతాయి. మే 28న ఫైనల్ జరుగుతుంది.
NEWS – BCCI announces squads for My11Circle Women’s T20 Challenge. @ImHarmanpreet to lead the Supernovas, @mandhana_smriti will lead the Trailblazers and Deepti Sharma to Captain Velocity.
More details here – https://t.co/3y0WYcnDGA #WT20Challenge
— IndianPremierLeague (@IPL) May 16, 2022