IPL 2022: ఆజట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే వరకు పెళ్లి చేసుకోనన్న మహిళ.. వైరలవుతోన్న పోస్టర్..

|

Apr 13, 2022 | 1:01 PM

IPL 2022 CSK vs RCB: CSK (చెన్నై సూపర్ కింగ్స్), RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)ని ఓడించి, లీగ్‌లో తన తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చెన్నై వరుస పరాజయాలకు స్వస్తి పలికింది.

IPL 2022: ఆజట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే వరకు పెళ్లి చేసుకోనన్న మహిళ.. వైరలవుతోన్న పోస్టర్..
Ipl 2022 Csk Vs Rcb
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన అభిమాన జట్టు ట్రోఫీని గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేసింది. ఈమేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వీరాభిమాని పోస్టర్‌ను పట్టుకుని ఉన్న ఫొటో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. మంగళవారం సాయంత్రం నవీ ముంబైలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మ్యాచ్‌లో ఈ సీన్ కనిపించింది. “ RCB IPL ట్రోఫీని గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోను” అని రాసి ఉన్న పోస్టర్‌ను పట్టుకుని మహిళ కనిపించింది. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

శివమ్ దూబే, రాబిన్ ఉతప్పల మధ్య మొత్తం 165 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇది ఐపీఎల్‌లో 3వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై ఇన్నింగ్స్‌ 216 పరుగులు చేరింది. బెంగుళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి చెన్నై 23 పరుగుల తేడాతో, లీగ్‌లో తన తొలి విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది తొలి విజయం కాగా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సీఎస్‌కే ఈ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ నడుస్తోంది. అయితే, అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలచుకున్న జట్లతో ముంబై(5), చెన్నై(4) జట్లు నిలిచాయి. కాగా, ఇంతవరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోలేకపోయింది. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరిక తీర్చాలని బరిలోకి దిగుతున్నా.. కాలం కలిసిరాకపోవడంతో కోహ్లీ సేన ఘెరంగా విఫలమవుతూ వచ్చింది. అయితే, ఈసారి కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, డుప్లిసిస్ ఆర్‌సీబీ బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఈసారైనా ట్రోఫీ దక్కాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.

Also Read: Watch Video: గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Watch Video: బౌలింగ్‌లో భారీగా రన్స్, ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు మిస్.. ధోనిని చూసి నేర్చుకో హార్దిక్ అంటోన్న ఫ్యాన్స్..