IPL 2023: 7 ఫోర్లు, 8 సిక్సర్లు.. 15 బంతుల్లో 76 పరుగులు బాదేసిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరంటే?

|

Jan 14, 2023 | 8:47 PM

ప్రస్తుతం సౌతాఫ్రికాలో టీ20 లీగ్ జరుగుతోంది. ఇందులో కొంతమంది ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫ్రాంచైజీలను ఆకట్టుకుంటున్నారు.

IPL 2023: 7 ఫోర్లు, 8 సిక్సర్లు.. 15 బంతుల్లో 76 పరుగులు బాదేసిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరంటే?
Will Jacks
Follow us on

ప్రస్తుతం సౌతాఫ్రికాలో టీ20 లీగ్ జరుగుతోంది. ఇందులో కొంతమంది ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫ్రాంచైజీలను ఆకట్టుకుంటున్నారు. అందులో ఒకరు విల్ జాక్స్. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న విల్ జాక్స్.. ఇటీవల సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

సెంచూరీయన్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్ విల్ జాక్స్(92) చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకవైపు ఫిల్ సాల్ట్(1), రోసెవ్(20) తక్కువ పరుగులకే పెలివియన్ చేరినప్పటికీ.. బ్రుయన్(42)తో కలిసి మూడో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు జాక్స్. ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కున్న జాక్స్ 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. అతడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మాగల, బార్ట్‌మాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జాన్సన్, కర్సే చెరో వికెట్ తీశారు.

అటు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 15 పరుగులకే 2 వికెట్లు పడగా.. ఆ తర్వాత కూడా ఏ బ్యాటర్‌ పెద్ద ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. కెప్టెన్ మార్కారమ్(46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మట్స్(28) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మార్కో జాన్సన్(36), కర్సే(26) గెలుపు కోసం తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఉపయోగం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.