TV9 Poll: టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వీరిలో ఎవరికుంది?

|

Sep 17, 2021 | 12:04 PM

TV9 Poll: టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి.. తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే చర్చ నడుస్తోంది.

TV9 Poll: టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వీరిలో ఎవరికుంది?
Virat Kohli Rohit Sharma
Follow us on

TV9 Poll: టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి.. తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే చర్చ నడుస్తోంది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ, రోహిత్‌తోపాటు ఆ సత్తా మరో ముగ్గురికి ఉందని మాజీలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా టీ20 తదుపరి కెప్టెన్‌గా రోహిత్ శర్మతో పాటు రిషత్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కీపర్‌గా తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. ధోనిలా టీమిండియాను నడిపించగల సత్తా ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంకు సారథిగా మారిన రిషబ్.. టీంను విజయవంతంగా ముందుకు తీసుకుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాకు భవిష్యత్ ఆశా కిరణంలా ఉన్నాడని అంటున్నారు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్‌ పోటీల్లో ఉన్నట్లు మాజీలు అంటున్నారు. 2018 నుంచి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. తన హయంలో ఢిల్లీని సెమీ ఫైనల్, ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు.

మరోవైపు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా టీ20 కెప్టెన్ పోటీదారుల్లో ఉన్నాడని తెలుస్తోంది. 2019 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథిగా ఉన్నాడు. అయితే టీం ప్లేయర్స్ అంతగా రాణించకపోవడంతో కేఎల్ రాహుల్ టీం ముందుకు సాగడంల లేదు. ఇక ఫైనల్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. కెప్టెన్ పోటీదారుల్లో కీలకమైన వాడు. ఇప్పటికే తనకు అవకాశం వచ్చిన్నప్పుడల్లా టీమిండియాను విజయాలతో దూసుకెళ్లేలా చేశాడు. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత వైస్ కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఇంతకు మీరేమనుకుంటున్నారు. ఈ నలుగురిలో టీ20ల్లో భారత్‌ను సమర్థవంతంగా ఎవరు నడిపిస్తారని అనుకుంటున్నారు. అయితే మీ అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా పంచుకోండి.

Also Read:

హిట్ మ్యాన్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా ఆ ఆటగాడికే సునీల్ గవాస్కర్ ఓటు

Yuzvendra Chahal: బీసీసీఐ సెలక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన యుజ్వేంద్ర చాహల్..! జస్ట్ కిడ్డింగ్ అన్నా.. వదలని నెటిజన్లు