Team India Captain : టీమిండియా కొత్త బాస్ ఎవరు? గిల్, అయ్యర్, అక్షర్.. ఎవరి జాతకం మారుతుందో!

Team India Captain :భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20ల్లో దూసుకుపోతోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత పగ్గాలు చేపట్టిన సూర్య, కెప్టెన్‌గా తన ముద్ర వేశారు. ఆయన నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

Team India Captain : టీమిండియా కొత్త బాస్ ఎవరు? గిల్, అయ్యర్, అక్షర్.. ఎవరి జాతకం మారుతుందో!
Shubman Gill Captain

Updated on: Dec 23, 2025 | 7:15 AM

Team India Captain :భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20ల్లో దూసుకుపోతోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత పగ్గాలు చేపట్టిన సూర్య, కెప్టెన్‌గా తన ముద్ర వేశారు. ఆయన నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అయితే, 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ సూర్యకు కెప్టెన్‌గా ఆఖరి టోర్నీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సూర్య వయస్సు పెరగడం, గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం బీసీసీఐని ఆలోచనలో పడేసింది. దీంతో 2026 వరల్డ్ కప్ తర్వాత లాంగ్ టర్మ్ కెప్టెన్ కోసం వెతుకులాట మొదలైంది. ప్రస్తుతం ఈ రేసులో ముగ్గురు ఆటగాళ్లు హాట్ ఫేవరెట్లుగా ఉన్నారు.

1. శుభ్‌మన్ గిల్: టీమిండియా తదుపరి సూపర్ స్టార్‌గా పిలవబడే శుభ్‌మన్ గిల్, కెప్టెన్సీ రేసులో అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం గిల్ ఫామ్ కాస్త అటుఇటుగా ఉన్నా, బీసీసీఐ మాత్రం అతనిపై చాలా నమ్మకంగా ఉంది. ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనేది బోర్డు ఆలోచన. ఆ ప్లాన్‌లో గిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడు. వయస్సు రీత్యా చూసినా గిల్ మరో పదేళ్ల పాటు జట్టును నడిపించగలడు. అందుకే సూర్య తర్వాత సహజ సిద్ధంగా పగ్గాలు అందేది గిల్ కే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

2. శ్రేయస్ అయ్యర్: కెప్టెన్సీ విషయంలో శ్రేయస్ అయ్యర్‌కు ఉన్న రికార్డు చాలా గొప్పది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఛాంపియన్‌గా నిలబెట్టడం, ఆ తర్వాత ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లడం అయ్యర్ నాయకత్వ పటిమకు నిదర్శనం. ముఖ్యంగా ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించడంలో అయ్యర్ దిట్ట. ఐపీఎల్ 2025లో బ్యాటర్‌గా కూడా 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 600 పైగా పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఫామ్ మరియు ఫిట్‌నెస్ సహకరిస్తే, టీ20 ఫార్మాట్‌లో సూర్యకు సరైన వారసుడు శ్రేయస్ అయ్యరే అనడంలో సందేహం లేదు.

3. అక్షర్ పటేల్: ఇక అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు అక్షర్ పటేల్. జట్టులో ఆల్ రౌండర్‌గా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న అక్షర్‌కు ఇటీవల టీ20 వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది అతను భవిష్యత్తు కెప్టెన్సీ రేసులో ఉన్నాడనే దానికి సంకేతం. అక్షర్ పటేల్ మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడు. ఎంఎస్ ధోనీ తరహాలో వ్యూహాలు పన్నడంలో అక్షర్ నేర్పరి అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సీనియర్ ఆటగాడిగా జట్టులో అందరితో మంచి సంబంధాలు ఉండటం కూడా అక్షర్‌కు ప్లస్ పాయింట్. ఒకవేళ బోర్డు గిల్ లేదా అయ్యర్ వైపు కాకుండా అనుభవం వైపు మొగ్గు చూపితే అక్షర్ పటేల్ అదృష్టం తన్నుకుపోవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..