
Stephan Pascal Catch Video: అండర్ 19 ప్రపంచకప్ 2024 దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఇందులో ఇప్పుడు సూపర్-6 రౌండ్‌లో జట్లు తలపడుతున్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ స్టీఫెన్ పాస్కల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అయితే, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఆటగాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్ స్టీఫెన్ పాస్కల్ క్యాచ్ పట్టడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 42వ ఓవర్ చివరి బంతికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రాఫెల్ మెక్‌మిలన్ శక్తివంతమైన షాట్ ఆడాడు. అప్పుడు పాయింట్ వద్ద నిలబడి పాస్కల్ గాలిలో ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చాలా ప్రమాదకరంగా ఉండడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఉలిక్కిపడ్డారు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున శామ్ కాన్‌స్టాన్స్ 108 పరుగులతో అద్భుతమైన సెంచరీని ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఇది కాకుండా మెక్‌మిలన్ 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. హ్యూ వెబ్‌జెన్ 22 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. హర్జాస్ సింగ్ 16 పరుగులు చేశాడు.
అనంతరం ఛేజింగ్ మొదలుపెట్టిన వెస్టిండీస్ కేవలం 4.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. అనంతరం వర్షంతో మ్యాచ్ రద్దైంది. దీంతో ఇరుజట్ల ఖాతాలో చెరో పాయింట్ వచ్చి చేరింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..