Pakistan vs West Indies: పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఫన్నీ సీన్ కనిపించింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ వేసేందుకు మహమ్మద్ వసీం జూనియర్ రంగంలోకి దిగాడు. వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ ఓవర్ ఐదో బంతికి భారీ సిక్సర్ బాదాడు. బంతి వెళ్లి స్టేడియం పైకప్పుపై పడింది. కింగ్ 20 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కానీ, ఆ తర్వాతి బంతికే మహ్మద్ వసీం జూనియర్ సత్తా చాటాడు. అతని అద్భుతమైన బంతుల్లో కింగ్ బౌల్డ్ అయ్యాడు. భారీ సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అవ్వడం తో బౌలర్ ఆనందానికి హద్దులు లేవు. కింగ్ తన ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. అదే సమయంలో, వసీమ్ జూనియర్ ఈ మ్యాచ్‌లో 44 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ రెండు బంతుల కథకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అచ్చం వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్ ఇన్నింగ్స్‌లాగే..
1996 ప్రపంచకప్ భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌కు చిరస్మరణీయమైనది. పాకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వెంకటేష్, పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ అమీర్ సోహైల్ మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదాన్ని ఏ క్రికెట్ అభిమాని అయినా మరచిపోలేరు. ఈ మ్యాచ్‌లో కూడా, వెంకటేష్ వేసిన బంతికి అమీర్ మొదట అద్భుతమైన ఫోర్ కొట్టాడు. కానీ, ఆ తర్వాతి బంతికి వెంకటేష్ పునరాగమనం చేసి అమీర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాచ్‌లో ఏం జరిగింది?
పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. కరాచీ వేదికగా జరిగిన చివరి టీ20లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్ జట్టు 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. రిజ్వాన్ 45 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేయగా, బాబర్ ఆజం 53 బంతుల్లో 79 పరుగులు చేశాడు.
MONSTROUS 6 and a FLATTENED STUMP!
Peak T20 cricket at the NSK ???#PAKvWI #HumTouKhelainGey pic.twitter.com/EidHqASRbj— Pakistan Cricket (@TheRealPCB) December 16, 2021
Also Read: Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!