4,4,6..తో బెంబేలెత్తించాడు.. కట్ చేస్తే.. తర్వాతి బంతికే తుస్సుమన్న సన్‌రైజర్స్ బ్యాటర్!

వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మంచి ఆటతీరు కనబరుస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను.. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ బట్లర్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ స్థానంలో హ్యారీ బ్రూక్ జట్టులోకి వచ్చాడు..

4,4,6..తో బెంబేలెత్తించాడు.. కట్ చేస్తే.. తర్వాతి బంతికే తుస్సుమన్న సన్‌రైజర్స్ బ్యాటర్!
Eng Vs Nz

Updated on: Oct 05, 2023 | 5:27 PM

వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మంచి ఆటతీరు కనబరుస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను.. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ బట్లర్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక అతడి స్థానంలో తుది జట్టులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. వచ్చీరాగానే తన దూకుడైన ఆటను ప్రదర్శించిన బ్రూక్.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారైనా కీలక ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరిన వేళ.. ఒకవైపు జో రూట్ పరుగులు రాబడుతుంటే.. స్టాండింగ్ ఇవ్వాల్సిందిపోయి.. హిట్టింగ్‌కు వెళ్లిపోయాడు హ్యారీ బ్రూక్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్రన్ బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదేసి.. బౌలర్‌పై ఒత్తిడి పెంచాడు. అయితేనేం.. నాలుగో బంతికే బంతిని సరిగ్గా క్యాలుకులేట్ చేయలేకపోయిన బ్రూక్.. డీప్-మిడ్‌ వికెట్‌లో కాన్వె‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తద్వారా ప్రపంచకప్‌లో వచ్చిన మొదటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు బ్రూక్. ప్రత్యర్ధులపై బ్రూక్ విరుచుకుపడటాడని అనుకుంటే.. ఇలా ఔట్ కావడంతో డగౌట్‌లో ఉన్న స్టోక్స్ దెబ్బకు షాక్ అయ్యాడు.

మరోవైపు, ఈ మెగా టోర్నీ.. అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలబడుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ అయిన కేన్ విలియమ్సన్, బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. అటు కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ, ఫెర్గూసన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యారు.

ఇంగ్లాండ్(ప్లేయింగ్ ఎలెవన్):

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్ & వికెట్ కీపర్) లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్(ప్లేయింగ్ ఎలెవన్):

డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్ & వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..