బౌలింగ్ నేర్పిస్తే పాక్‌నే ట్రోల్ చేస్తావా..?: టీమిండియా పేసర్‌పై వసీం అక్రమ్ ఫైర్

Wasim Akram vs Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్‌ను 2004లో తొలిసారి కలిశానని వసీమ్‌ అక్రమ్ చెప్పాడు. అప్పట్లో బౌలింగ్‌కు సంబంధించిన కీలక సూచనలు ఇచ్చానని, ఇప్పుడు పాకిస్థాన్‌పై ఇర్ఫాన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పరువు తీస్తున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బౌలింగ్ నేర్పిస్తే పాక్‌నే ట్రోల్ చేస్తావా..?: టీమిండియా పేసర్‌పై వసీం అక్రమ్ ఫైర్
Wasim Akram Vs Irfan Pathan

Updated on: Sep 04, 2026 | 1:47 PM

Wasim Akram vs Irfan Pathan: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీమ్‌ అక్రమ్.. టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకున్న పరిచయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2004లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇర్ఫాన్‌ను తొలిసారి కలిశానని అక్రమ్ చెప్పాడు. అప్పట్లో ఇర్ఫాన్ తనకు పెద్ద అభిమానిగా ఉండేవాడని, బౌలింగ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చానని వివరించాడు. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో మైండ్‌సెట్, మణికట్టు స్థానం, బ్యాటర్‌ను అర్థం చేసుకోవడం, వైవిధ్యమైన బంతులను ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు వద్దు వంటి అంశాలపై మాట్లాడినట్లు తెలిపాడు.

ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ యాక్షన్‌ తన శైలిని పోలి ఉండేదని అక్రమ్ పేర్కొన్నాడు. అయితే అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడికి బౌలింగ్ యాక్షన్ మార్చడం కంటే మానసిక అంశాలు, వ్యూహాలపై సూచనలు ఇవ్వడం ముఖ్యమని చెప్పాడు. తన సలహాలు తీసుకున్నప్పటికీ ఇర్ఫాన్ తన కెరీర్ ప్రారంభంలోనే మంచి ప్రదర్శనలు చేశాడని ప్రశంసించాడు.

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటాడని అక్రమ్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావిస్తూ.. ఇర్ఫాన్ మంచి వ్యక్తి అని, ఇప్పటికీ తనను కలుస్తుంటాడని చెప్పాడు. పాకిస్థాన్ అభిమానులు కూడా ఇలాంటి పోస్టులకు స్పందించేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నాడు. దీంతో అక్రమ్ వ్యాఖ్యల్లో పాత పరిచయం, క్రికెట్‌కు సంబంధించిన అనుబంధంతో పాటు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మధ్య ఉండే సోషల్ మీడియా వాతావరణం కూడా ప్రస్తావనకు వచ్చింది.

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us