Indian Cricket Team: విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. సిరీస్ తర్వాత, విరాట్ కోహ్లి తన నిర్ణయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులకు డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలియజేశాడు. కోహ్లి కోరుకుంటే, అతను కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని అత్యుత్తమంగా ముగించేవాడు. కానీ, అతను వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాడు. ఆంగ్ల వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం , ఒక సీనియర్ బీసీసీఐ అధికారి కోహ్లీకి టెస్ట్ కెప్టెన్‌గా వీడ్కోలు మ్యాచ్‌ను ఆఫర్ చేశాడు. కానీ, కోహ్లీ దానిని తిరస్కరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
బెంగుళూరులో తన 100వ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌గా వీడ్కోలు మ్యాచ్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ అధికారి అందించారు. కానీ, కోహ్లీ దానిని తిరస్కరించాడు. ఈ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లి.. ‘ఒక్క మ్యాచ్ వల్ల ఎలాంటి తేడా ఉండదు. నేను అలానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.
బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని..
దక్షిణాఫ్రికాతో ఓడిన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వార్తాపత్రిక కథనం ప్రకారం, బీసీసీఐ మరో సిరీస్‌లో కోహ్లీకి కెప్టెన్సీని ఇవ్వడం సౌకర్యంగా ఉంది. అయితే కెప్టెన్‌గా ఉండటం వల్ల వచ్చే ఒత్తిడి, బాధ్యతను విడనాడాలని, తద్వారా తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోహ్లీ కోరుకున్నాడు. ఒకప్పుడు కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీలు వచ్చేవి. అతను టెస్ట్ కెప్టెన్‌గా తన అరంగేట్రంలో సెంచరీని కూడా సాధించాడు. అయితే గత రెండేళ్లుగా అతని బ్యాట్‌లో సెంచరీ నమోదు కాలేదు. కోహ్లీ తన చివరి సెంచరీని 2019లో చేశాడు. అయితే అప్పటి నుంచి కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ నమోదు కాలేదు.
కోహ్లీ తర్వాత కెప్టెన్ ఎవరు?
ప్రస్తుతం కోహ్లి తర్వాత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తింది. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంలో తొందరపడడం లేదు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కి ముందు బోర్డు ఈ విషయాన్ని ప్రకటించవచ్చు. ఈ రేసులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇటీవలే టెస్టు జట్టుకు రోహిత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే మూడు ఫార్మాట్ల భారాన్ని మోయగలడని నిర్ధారించుకున్న తర్వాతే సెలక్టర్లు అతని పేరును ఫైనల్ చేయనున్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే కెప్టెన్ ఆ యువ ఆటగాడే.. మనసులో మాట బయటపెట్టిన యువీ..
Big Bash League : టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పాకిస్తాన్ ఆటగాళ్లు.. కారణమేంటంటే..