Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్న విరాట్ కోహ్లీ.. 15వ సీజన్‌లో ప్లేయర్‌గానే బరిలోకి..!

|

Sep 19, 2021 | 11:09 PM

RCB: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత వారం ఓ సంచలన వార్తను వెల్లడించి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ తరువాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్న విరాట్ కోహ్లీ.. 15వ సీజన్‌లో ప్లేయర్‌గానే బరిలోకి..!
Virat Kohli
Follow us on

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత వారం ఓ సంచలన వార్తను వెల్లడించి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ తరువాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక అప్పటి నుంచి కోహ్లీ వారసుడు ఎవరంటూ చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా మరో హాట్ న్యూస్‌తో విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు

ఐపీఎల్ 2021 సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఆర్‌సీబీ తన సోషల్ మీడియాలో విరాట్ మాట్లుడుతున్న ఓ వీడియోను పంచుకుంది. ‘నా కెప్టెన్సీలో చివరి ఐపీఎల్. ప్లేయర్‌గా మాత్రం ఆర్‌సీబీలోనే కొనసాగుతాను. ఇంత వరకు అండగా నిలిచిన ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆర్‌సీబీకి 14 ఏళ్లుగా కెప్టెన్‌గా చేసిన విరాట్ కోహ్లీ.. ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు. ప్రస్తుం టీం మంచి ఫాంలో ఉంది. ఈ సారైనా ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఘనమైన వీడ్కోలు చెప్పినట్లే. అయితే తరువాత సీజన్‌లకు కెప్టెన్‌గా ఎవరుంటారోనని అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి.

Also Read: CSK vs MI Live Score, IPL 2021: ముంబై విజయానికి 18 బంతుల్లో 49 పరుగులు.. ప్రస్తుత స్కోర్ 108/6

Indian Cricket Team: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఫుల్ బిజీగా ఆటగాళ్లు.. భారత్ రానున్న దేశాలు ఇవే..!

CSK vs MI: తొలి మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్.. తొలి ఫోర్, వికెట్ పడేది అప్పుడే.. భారత మాజీ క్రికెటర్ ఏమంటున్నాడంటే..?