Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

BCCI President Sourav Ganguly: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓడిపోవడంతో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీ శనివారం నిర్ణయించుకున్నాడు.

Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
Bcci President Sourav Ganguly On Virat Kohli Resign
Follow us

|

Updated on: Jan 16, 2022 | 4:06 PM

Indian Cricket Team: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హఠాత్తుగా రాజీనామా చేయడంతో అభిమానుల గుండె పగిలిపోయింది. మూడు నెలల క్రితం మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే జట్టులోకి రానున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై, అభిమానుల నుంచి అనుభవజ్ఞుల వరకు సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారు. మరోవైపు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా కోహ్లీ కెప్టెన్సీపై ట్వీట్ చేశాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగినప్పటి నుంచి అతడికి, సౌరవ్ గంగూలీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. విలేకరుల సమావేశంలో కోహ్లీని అబద్ధాలకోరుగా ప్రకటించిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంలో బీసీసీఐ హస్తం లేదని భారత మాజీ కెప్టెన్ గంగూలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పష్టం చేశాడు. వన్డేల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించినప్పుడు, గంగూలీ అభిమానులను లక్ష్యంగా చేసుకున్నాడు.

సౌరవ్ గంగూలీ అర్థరాత్రి ట్వీట్ చేస్తూ, కోహ్లీని కెప్టెన్సీ నుంచి వైదొలగమని అడగలేదని, అయితే అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని రాసుకొచ్చాడు. ‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఆటలోని ప్రతి ఫార్మాట్‌లో భారత క్రికెట్ విజయాలు సాధించింది. ఇది అతని వ్యక్తిగత నిర్ణయమని, బీసీసీఐ దానిని గౌరవిస్తుంది. జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో అతను టీమ్ ఇండియాలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. గొప్ప ఆటగాడు’ అంటూ రాసుకొచ్చాడు.

విరాట్ కెప్టెన్సీపై వివాదం నడుస్తోంది.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 వైఫల్యంతో టీ20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఆ తర్వాత అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగొద్దరని కోహ్లిని కోరినట్లు సౌరవ్ గంగూలీ ప్రకటన చేశాడు. అయితే ఈ ప్రకటనను కొట్టిపారేసిన కోహ్లి.. తనతో ఎవరూ అలాంటి మాట అనలేదని అన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు టెస్టు జట్టు ఎంపికైనప్పుడు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో ఫోన్‌లో మాట్లాడాడు. జట్టుపై చర్చించిన అనంతరం వన్డే జట్టుకు ఇకపై నువ్వే కెప్టెన్‌గా ఉంటావని చెప్పినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

Also Read: 11 ఏళ్ల తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పడిపోయిన సగటు.. సెంచరీ లేకుండానే సిరీస్‌ ముగించిన ప్లేయర్ ఎవరంటే?

పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించడమే అతడు చేసిన పాపం..! కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది..?