Virat Kohli: జస్ట్ 58 రన్స్.. మరో సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ..! 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

|

Sep 12, 2024 | 12:04 PM

ఇప్పటికే టీ20 ఫార్మెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వీరూ భాయ్.. ఇప్పుడిక టెస్ట్, వన్డే ఫార్మెట్‌లపై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టెస్ట్ మ్యాచ్‌‌లో కోహ్లీ ఆటను వీక్షించేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ సృష్టించిన పలు రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశారు. మరికొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లీని ఊరిస్తున్నాయి.

Virat Kohli: జస్ట్ 58 రన్స్.. మరో సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ..! 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి..
Virat Vs Sachin News
Image Credit source: AFP/PTI
Follow us on

భారత్ – బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. పాకిస్థాన్‌ను సొంత గడ్డపై చిత్తుగా ఓడించి 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ మంచి ఊపుమీద ఉంది. భారత్ గడ్డపై కూడా సత్తా చాటాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే బంగ్లా జట్టును సీరియస్‌గా తీసుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు.. ఆ మేరకు పక్కా వ్యూహాలతో రెడీ అవుతున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడనుండటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే టీ20 ఫార్మెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వీరూ భాయ్.. ఇప్పుడిక టెస్ట్, వన్డే ఫార్మెట్‌లపై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో టెస్ట్ మ్యాచ్‌‌లో కోహ్లీ ఆటను వీక్షించేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ సృష్టించిన పలు రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశారు. మరికొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లీని ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్ 100 సెంచరీల రికార్డును నెలకొల్పగా.. 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 80 సెంచరీలు సాధించాడు. సచిన్ సెంచరీల రికార్డులను కోహ్లీ అధిగమించేందుకు మరికొన్ని ఏళ్లు పట్టే అవకాశముంది.

అయితే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ వేళ మరో వరల్డ్ రికార్డు విరాట్ కోహ్లీని ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలురాయిని అధిగమించేందుకు కోహ్లీ మరో 58 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అత్యంత వేగంగా 27 వేల పరుగులు సాధించిన రికార్డు సచిన్ టెండుల్కర్ పేరిట ఉంది. కేవలం 623 ఇన్నింగ్స్ ( 226 టెస్ట్ ఇన్నింగ్స్, 396 వన్డే ఇన్నింగ్స్, 1 టీ20 ఇన్నింగ్స్)లో సచిన్ ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 591 ఇన్నింగ్స్ ఆడి.. ఏకంగా 26,942 పరుగలు సాధించాడు. మరో 58 పరుగులు సాధిస్తే.. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. ఈ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మరో 8 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 27 వేల పరుగుల మైలురాయిని అధిగమిస్తే.. 147 ఏళ్ల చరిత్రలో 600 ఇన్నింగ్స్ లోపు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధిస్తాడు.

ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. మరో 58 పరుగులు సాధిస్తే..విరాట్ కోహ్లీ కూడా వారి సరసన చేరుతాడు.