Video: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. సంచలనం సృష్టించిన తెలుగబ్బాయ్.. టెస్టుల్లో టీ20 ఊచకోత.. ఎవరంటే?

|

Feb 21, 2024 | 9:19 PM

Vamshi Krishna Smashed Six Sixes In An Over: 22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వంశీ కృష్ణ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో T-20 వలె తుఫాన్ బ్యాటింగ్‌తో భీభత్సం నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రవిశాస్త్రి (1985), యువరాజ్ సింగ్ (2007), రుతురాజ్ గైక్వాడ్ (2022)ల క్లబ్‌లో చేరాడు.

Video: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. సంచలనం సృష్టించిన తెలుగబ్బాయ్.. టెస్టుల్లో టీ20 ఊచకోత.. ఎవరంటే?
Six Sixes In An Over
Follow us on

Vamshi Krishna Smashed Six Sixes In An Over: ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ వంశీకృష్ణ తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ 22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో T-20 లాగా తుఫానుగా బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. వంశీ పేలుడు బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ స్వయంగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

378 పరుగులు చేసిన ఆంధ్రప్రదేశ్..

అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్టు ఓపెనర్ వంశీకృష్ణ.. రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఒక్క ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు బాదాడు. వంశీ కేవలం 64 బంతుల్లోనే 110 పరుగులతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. అతని అద్భుత ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది.

స్పెషల్ జాబితాలో చోటు..

వంశీ కృష్ణ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన తర్వాత రవిశాస్త్రి (1985), యువరాజ్ సింగ్ (2007), రుతురాజ్ గైక్వాడ్ (2022)ల క్లబ్‌లో చేరాడు. కాగా, రైల్వేస్‌ తరపున ఎస్‌ఆర్‌ కమర్‌, ఎండీ జైస్వాల్‌లు తలో మూడు వికెట్లు తీశారు.

597 బంతుల్లో 268 పరుగులు..

విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను 378 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ చేసిన రైల్వేస్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. రైల్వేస్ ఓపెనర్ అన్ష్ యాదవ్ బౌలర్లపై భీకరంగా దాడి చేసి 597 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 268 పరుగులు చేశాడు.

సత్తా చాటిన రవి సింగ్, అంచిత్ యాదవ్..

దీంతో పాటు రవి సింగ్ కూడా 311 బంతుల్లో 17 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 258 పరుగులు చేశాడు. అంచిత్ యాదవ్ 219 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులు చేసి సెంచరీ చేశాడు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 865 పరుగులు చేసి 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..