Vamika: వామిక ఫొటోలు నెట్టింట వైరల్.. కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli-Anushka Sharma: తమ కూతురు వామిక ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత విరుష్క జోడీ ఓ ప్రకటన విడుదల చేశారు.

Vamika: వామిక ఫొటోలు నెట్టింట వైరల్.. కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ..!
Gallery Virat Kohli And Daughter Vamika

Updated on: Jan 24, 2022 | 1:47 PM

Vamika Photos:భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామిక ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. టీవీలో కనిపించినప్పుడు స్క్రీన్‌షాట్లు తీసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వామికను చూడాలని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు ఆదివారం నాటి మ్యాచ్‌లో తళుక్కున మెరవడంతో అంతా వామిక ఫొటోలను నెట్టింట్లో తెగ షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ రిలీజ్ చేశారు.

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, “హాయ్ గైస్, నిన్న స్టేడియంలో మా కుమార్తె కనిపించడంతో, ఆ ఫొటోలను నెట్టింట్లో విస్తృతంగా షేర్ చేశారని తెలిసింది. ఆ సమయంలో కెమెరా మాపై ఉందని మాకు తెలియదు” అంటూ ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించారు.

“ఈ విషయంపై మా వైఖరి, అభ్యర్థన అలాగే ఉంది. మేం ఇంతకు ముందు వివరించిన కారణాల వల్ల వామిక ఫొటోలు క్లిక్ చేయోద్దని కోరుతున్నాం. ఒకవేళ పబ్లిష్ చేస్తే మాత్రం డిలీట్ చేయండి. ఇప్పటికే వామిక ఫొటోలను డిలీట్ చేసిన వారికి ధన్యవాదాలు” అంటూ ప్రకటించారు.

ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేయగానే స్టేడియంలోని వీఐపీ లాంజ్ నుంచి అనుష్క శర్మతో పాటు తన కుమార్తె వామికతో కలిసి చేతులు ఊపుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేసింది.

ఈ స్టార్ జంట కూతురిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెటిజన్లు స్క్రీన్‌షాట్‌లను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కూతురు వామిక ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం విరాట్‌తో పాటు అనుష్క, వామిక దక్షిణాఫ్రికాలో ఉన్నారు.

Also Read: Team India: 5 నెలలు.. 4 టీంలు.. టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?

Virat Kohli-Anushka Sharma: కోహ్లీ స్థానంలో నేనుంటే అనుష్కను పెళ్లి చేసుకోను: అక్తర్ కీలక వ్యాఖ్యలు

Follow Us