
U19 World Cup 2026 : ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ నేటి నుంచి (జనవరి 15, 2026) గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. టోర్నీ మొదటి రోజే మూడు ఆసక్తికరమైన పోరులు జరగనున్నాయి. ఇందులో అందరి కళ్లు భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఆయుష్ మ్హాత్రే సారథ్యంలోని టీమిండియా ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల సౌతాఫ్రికా పై 3-0తో సిరీస్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు, అదే ఊపును వరల్డ్ కప్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొద్దికాలంగా అండర్-19, సీనియర్ లెవల్ క్రికెట్‌లో వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలోనూ భారీ ధరకు అమ్ముడుపోయిన ఈ కుర్రాడు, సీనియర్ ఆటగాళ్లతో ఆడిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించనున్నాడు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాడే. గాయం నుంచి కోలుకుని జట్టులోకి చేరిన ఆయుష్, వైభవ్‌తో కలిసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు.
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
భారత్‌లో ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లను మీరు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక మొబైల్ లేదా ట్యాబ్లెట్లలో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు టీవీలో టెలికాస్ట్ అవుతాయి. ఒకే రోజు మూడు మ్యాచ్‌లు ఉన్నందున కొన్ని మ్యాచ్‌లు కేవలం ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండవచ్చు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయి.
నేడు జరిగే ఇతర మ్యాచ్‌లు
టీమిండియా మ్యాచ్‌తో పాటు నేడు మరో రెండు పోరులు జరగనున్నాయి. జింబాబ్వే జట్టు స్కాట్లాండ్‌తో తలపడనుండగా, వెస్టిండీస్ జట్టు టాంజానియాతో పోటీ పడనుంది. గ్రూప్ దశలో ప్రతీ విజయం కీలకమే కావడంతో జట్లన్నీ గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జట్టులో చాలామంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నందున, భారత్-అమెరికా మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
భారత్, అమెరికా జట్లు
టీమిండియా : ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హేనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్, ఆర్.ఎస్. అంబరీష్, మహమ్మద్ ఇనాన్, హర్వంత్ పంగాలియా,
అమెరికా జట్టు : ఉత్కర్ష్ శ్రీవాస్తవ (కెప్టెన్), అమరీందర్ గిల్, సాహిల్ గార్గ్, అర్జున్ మహేష్ (వికెట్ కీపర్), అద్రిత్ ఝాంబ్, అమోఘ్ అరేపల్లి, నితీష్ సుదిని, శివ శని, అదిత్ కప్ప, సాహిర్ భాటియా, రాయన్ తాజ్, అద్వైత్ కృష్ణ, సబరీష్ ప్రసాద్, ఋత్విక్ అప్పిడి, రిషబ్ షింపి,
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..