AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఖాయం.. కానీ అసలుసిసలు పరీక్ష అక్కడే

Vaibhav Suryavanshi : వైభవ్ పెర్ఫార్మెన్స్ చూసి అతడిని వెంటనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే పుజారా మాత్రం వైభవ్ టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఖాయం.. కానీ అసలుసిసలు పరీక్ష అక్కడే
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 08, 2026 | 2:53 PM

Share

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్న ఈ టీనేజ్ సెన్సేషన్ గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ కేవలం టీ20లకే పరిమితం కాకుండా టెస్టు క్రికెట్ కూడా ఆడాలని, అప్పుడే ఒక ఆటగాడిగా పరిపూర్ణత వస్తుందని పుజారా అభిప్రాయపడ్డారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి అతిపెద్ద లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 404 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భవిష్యత్తు టీమ్ ఇండియా స్టార్‌గా అవతరించాడు.

వైభవ్ పెర్ఫార్మెన్స్ చూసి అతడిని వెంటనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే పుజారా మాత్రం వైభవ్ టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. “వైభవ్ టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడు, అతడికి త్వరలోనే టీమిండియా పిలుపు వస్తుంది. కానీ టెస్టు క్రికెట్ అనేది ప్రతి యువ ఆటగాడి మనసులో ఉండాలి. ఒక ఆటగాడికి గౌరవం, పట్టుదల, టెక్నిక్ అనేవి టెస్టుల నుంచే వస్తాయి. సామర్థ్యం ఉంటే వైభవ్ కచ్చితంగా టెస్టుల్లో కూడా రాణించాలి” అని పుజారా పేర్కొన్నారు.

టెస్టు క్రికెట్ గొప్పదే అయినప్పటికీ.. వైట్ బాల్ (పరిమిత ఓవర్ల) నిపుణులకు కూడా తమదైన ప్రాముఖ్యత ఉంటుందని పుజారా చెప్పారు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ వంటి ఆటగాళ్లను వారి బలాబలాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసే విధానాన్ని ఆయన సమర్థించారు. దీనివల్ల ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ఆయా ఫార్మాట్లలో జట్టు మరింత బలంగా తయారవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జియోస్టార్ సిటివి హిందీ ఫీడ్ నిపుణుడిగా తన కొత్త పాత్ర గురించి కూడా పుజారా ముచ్చటించారు. టీవీలో మ్యాచ్ విశ్లేషణ చేయడం ద్వారా అభిమానులకు ఆటలోని లోటుపాట్లను వివరించవచ్చని ఆయన చెప్పారు. ఆటగాడిగా తనకున్న అనుభవం ద్వారా ఫీల్డ్‌లో జరిగే పరిస్థితులు, టెక్నిక్, బౌలింగ్ వ్యూహాలను విడమర్చి చెప్పడం వల్ల కుర్రాళ్లకు కూడా ఆటపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఒక ఆటగాడు ఒక షాట్‌ను ఎలా ఆడాడు లేదా బౌలర్ ఏ యాంగిల్ వాడుతున్నాడు వంటి విషయాలు ప్రేక్షకులకు తెలియజేయడం తనకు సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఖాయం.. కానీ అసలుసిసలు పరీక్ష అక్కడే
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ ఖాయం.. కానీ అసలుసిసలు పరీక్ష అక్కడే
రోజుకు రూ.45తో కోటీశ్వరులు కాలేకపోయినా.. రూ.25 లక్షలు మీ సొంతం
రోజుకు రూ.45తో కోటీశ్వరులు కాలేకపోయినా.. రూ.25 లక్షలు మీ సొంతం
ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం..!
ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం..!
ఇంకా కొనసాగుతున్న ECET 2026 దరఖాస్తులు..రేపు హాల్ టికెట్లు విడుదల
ఇంకా కొనసాగుతున్న ECET 2026 దరఖాస్తులు..రేపు హాల్ టికెట్లు విడుదల
శని అమావాస్య.. ఆ రోజు అస్సలే చేయకూడని ఒకే ఒక్క పని ఇదే!
శని అమావాస్య.. ఆ రోజు అస్సలే చేయకూడని ఒకే ఒక్క పని ఇదే!
అక్కినేనికి ప్రత్యేకమైన రోజు.. మొదటిసారి మేకప్ వేసుకున్న ఏఎన్నార్
అక్కినేనికి ప్రత్యేకమైన రోజు.. మొదటిసారి మేకప్ వేసుకున్న ఏఎన్నార్
ప్రతి రోజు దీపం వెలిగిస్తే జీవితంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
ప్రతి రోజు దీపం వెలిగిస్తే జీవితంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే స్కాలర్‌షిప్స్ రానట్టే!
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే స్కాలర్‌షిప్స్ రానట్టే!
బి కేర్ ఫుల్.. 24 గంటల్లో ఫైల్ క్లియర్ అవ్వాలి.. సీఎం వార్నింగ్
బి కేర్ ఫుల్.. 24 గంటల్లో ఫైల్ క్లియర్ అవ్వాలి.. సీఎం వార్నింగ్
ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌