AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : 15 ఏళ్లకే రికార్డుల వేట షురూ.. 21 ఏళ్లకే వైభవ్ రిటైర్మెంట్? ఇంగ్లాండ్ దిగ్గజం జోస్యం నిజమవుతుందా ?

Vaibhav Suryavanshi : తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు మైకేల్ వాన్, ఫిల్ టఫ్నల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.21 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అభిప్రాయపడ్డారు.

Vaibhav Suryavanshi : 15 ఏళ్లకే రికార్డుల వేట షురూ.. 21 ఏళ్లకే వైభవ్ రిటైర్మెంట్? ఇంగ్లాండ్ దిగ్గజం జోస్యం నిజమవుతుందా ?
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 07, 2026 | 5:46 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు మైకేల్ వాన్, ఫిల్ టఫ్నల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతున్న వైభవ్, 21 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యువ సంచలనంపై ప్రస్తుతం క్రికెట్ లోకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇటీవల జరిగిన స్టిక్ టు క్రికెట్ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో మైకేల్ వాన్, ఫిల్ టఫ్నల్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ ఐపీఎల్ అంశాలపై చర్చించారు. ఇందులో వైభవ్ సూర్యవంశీ గురించి మైకేల్ వాన్ మాట్లాడుతూ ఆసక్తికర గణాంకాలను బయటపెట్టారు. “ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతులు) రికార్డును ఈ అబ్బాయి దాదాపు టచ్ చేశాడు, అప్పుడే 35 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. ఒకే సీజన్‌లో అభిషేక్ శర్మ వేసిన 42 సిక్సర్ల రికార్డును కూడా దాటేలా ఉన్నాడు, ఇప్పటికే 37 సిక్సర్లు బాదాడు” అని వాన్ కొనియాడారు.

21 ఏళ్లకే బర్న్ అవుట్?

చర్చ మధ్యలో ఫిల్ టఫ్నల్ జోక్యం చేసుకుంటూ, వైభవ్ వెళ్తున్న వేగం చూస్తుంటే 21 ఏళ్ల కల్లా అతడు అలసిపోయి రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మైకేల్ వాన్ స్పందిస్తూ.. “అవును, అప్పటికే అతడి దగ్గర కావాల్సినంత డబ్బు పోగవుతుంది, హాయిగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు” అని నవ్వుతూ అన్నారు. అయితే వైభవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే వచ్చే జూలైలో భారత్ తరపున ఇంగ్లాండ్ పర్యటనకు లేదా ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక కావాలని వాన్ ఆకాంక్షించారు.

వేలంలో వైభవ్ ధర ఎంత ఉండొచ్చు?

అలిస్టర్ కుక్ మాట్లాడుతూ.. వైభవ్ కాంట్రాక్ట్ గురించి చర్చించారు. రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని వదులుకోదని, ఒకవేళ వేలంలోకి వస్తే మాత్రం ధర ఆకాశాన్ని తాకుతుందని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమంగా సిక్సర్లు కొట్టే బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశీనే అని కుక్ స్పష్టం చేశారు. వైభవ్ బ్యాటింగ్‌లో ఉన్న పవర్, టైమింగ్ చూస్తుంటే అతడు టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా మారుతాడని అందరూ నమ్ముతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us