అబ్బో.. బుడ్డోడిలో ఈ లక్షణాలు కూడా ఉన్నాయా? శుబ్‌మన్ సర్దుకోవాల్సిందేనా..

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ స్టాండ్‌ఇన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి తొలి డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆర్యన్ జుయల్‌పై అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడంతో వైభవ్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలడం తో జుయల్ ఔటయ్యాడు.

అబ్బో.. బుడ్డోడిలో ఈ లక్షణాలు కూడా ఉన్నాయా? శుబ్‌మన్ సర్దుకోవాల్సిందేనా..
Vaibhav Sooryavanshi Drs

Updated on: Aug 30, 2026 | 6:23 PM

దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడటంతో వైభవ్ స్టాండ్‌ఇన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇదే తొలి నాయకత్వ అవకాశం. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే వైభవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 40వ ఓవర్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ 46 పరుగుల వద్ద బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతంలో బ్యాట్‌కు తగిలిన బంతిని వికెట్ కీపర్ అందుకున్నాడు.

ఈస్ట్ జోన్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో సహచరులతో చర్చించిన వైభవ్ చివరి క్షణాల్లో డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ ఆర్యన్ జుయల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. వైభవ్ తీసుకున్న తొలి రివ్యూ సక్సెస్ కావడంతో ఈస్ట్ జోన్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. జుయల్ ఔట్ అని స్క్రీన్‌పై కనిపించగానే వైభవ్ తన సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి

కేవలం 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వైభవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కెప్టెన్సీ తొలి రోజే ఒత్తిడిలో సరైన నిర్ణయం తీసుకోవడం అతడి క్రికెట్ పరిణతికి నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రాబోయే రోజుల్లో టీమిండియాకు కూడా కెప్టెన్ అయ్యే క్వాలిటీస్ కనిపిస్తున్నాయ్ అని, ప్రస్తుత టీమిండియా వన్టే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వైభవ్ నుంచి కెప్టెన్సీ విషయంలో పోటీ ఉంటుందని క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us