Video: 5 ఫోర్లు, 8 సిక్సర్లు.. 53 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్‌కు ఛాలెంజ్ విసిరిన సొంత టీంమేట్..

Vaibhav Sooryavanshi vs Lhuan-dre Pretorius: వైభవ్‌కు సొంత టీంమేట్ నుంచే పోటీ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ సహచరుడు లువాన్-డ్రే ప్రిటోరియస్ నుంచి గట్టి పోటీ వచ్చింది. నమీబియాతో టీ20లో 53 బంతుల్లో 101 పరుగులతో తొలి అంతర్జాతీయ శతకం సాధించిన ప్రిటోరియస్, ఫుల్ మెంబర్ జట్టుపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Video: 5 ఫోర్లు, 8 సిక్సర్లు.. 53 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్‌కు ఛాలెంజ్ విసిరిన సొంత టీంమేట్..
Vaibhav Sooryavanshi Vs Lhuan Dre Pretorius

Updated on: Sep 05, 2026 | 1:18 PM

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో యువ ఆటగాడి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ టీం సహచరుడు, దక్షిణాఫ్రికా ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 101 పరుగులతో తొలి అంతర్జాతీయ టీ20 శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది సత్తా చాటాడు. ప్రిటోరియస్ ధాటికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. అనంతరం నమీబియా జట్టు కూడా తగ్గేదేలే అంటూ గట్టి పోటీ ఇచ్చి 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులకే పరిమితమైంది.

ప్రిటోరియస్‌ రికార్డ్ సెంచరీ..

20 ఏళ్ల ప్రిటోరియస్ ఈ శతకంతో ఫుల్ మెంబర్ టీంపై టీ20 అంతర్జాతీయ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. ప్రిటోరియస్ 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

నమీబియాతో మ్యాచ్‌లో ప్రిటోరియస్‌తో కలిసి కానర్ ఎస్టర్‌హైజెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 40 బంతుల్లో 88 పరుగులు చేయడంతో తొలి వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు బాటలు పడ్డాయి.

వైభవ్‌తో పోలిక ఎందుకు..?

భారత్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా తక్కువ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించాడు. జింబాబ్వేతో జూలైలో జరిగిన మూడో టీ20లో అతడు 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: 27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!

ప్రిటోరియస్, వైభవ్ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్‌లో సహచరులు. వైభవ్ అంతర్జాతీయ సెంచరీకి ఇంకా చేరుకోకపోగా, ప్రిటోరియస్ ఇప్పటికే ఆ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఫ్యూచర్ యువ బ్యాటింగ్ ట్యాలెంట్‌పై చర్చలో ఈ ఇద్దరి పేర్లు కలిసి వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us