కేవలం 19 బంతుల్లో 94 పరుగులు.. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో పాక్, ఇంగ్లాండ్ బ్యాటర్ల బీభత్సం.. ఎవరంటే!

|

Nov 29, 2022 | 1:00 PM

క్రికెట్‌లో ఫార్మాట్ మారినప్పుడల్లా.. దానికి అనుగుణంగా బ్యాటర్ల ఆటతీరు కూడా మారిపోతోంది. ఇప్పుడు ఈ జెంటిల్‌మన్ గేమ్ గతంలో కంటే..

కేవలం 19 బంతుల్లో 94 పరుగులు.. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో పాక్, ఇంగ్లాండ్ బ్యాటర్ల బీభత్సం.. ఎవరంటే!
Abudabi T10 League
Follow us on

క్రికెట్‌లో ఫార్మాట్ మారినప్పుడల్లా.. దానికి అనుగుణంగా బ్యాటర్ల ఆటతీరు కూడా మారిపోతోంది. ఇప్పుడు ఈ జెంటిల్‌మన్ గేమ్ గతంలో కంటే మరింత రసవత్తరంగా మారింది. ప్రపంచమంతా డొమెస్టిక్ లీగ్‌లు పెరిగిపోవడంతో.. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు రెండు ఎండ్‌లలోనూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అబుదాబి టీ10 లీగ్‌లో ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది. అక్కడ పాకిస్తాన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు కలిసి తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్ధులను బెంబేలెత్తించారు. రెండు ఎండ్‌లలోనూ పరుగుల వరద పారించారు. ఇటీవల అబుదాబి టీ10 లీగ్‌లో చెన్నై బ్రేవ్స్, నార్తర్న్ వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ 34 పరుగుల తేడాతో చెన్నై బ్రేవ్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంలో పాకిస్థాన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు కీలక పాత్ర పోషించారు. చెన్నై బ్రేవ్స్ బౌలర్లను వీరిద్దరూ రఫ్ఫాడించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ జట్టుకు.. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖాన్, ఇంగ్లాండ్ ఆటగాడు ఆడమ్ లీత్‌ ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. ఇద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఉస్మాన్ ఖాన్ 270.83 స్ట్రైక్ రేట్‌తో 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. ఆడమ్ లీత్ కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 216 స్ట్రైక్ రేట్‌తో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. వీరిద్దరి విజృంభణతో నార్తర్న్ వారియర్స్ 10 ఓవర్లలో 141 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కేవలం 19 బంతుల్లో 94 పరుగులు..

మరోవైపు ఉస్మాన్, లీత్ కలిసి 19 బంతుల్లో 54 పరుగులు చేశారు. ఉస్మాన్ 11 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేయగా.. లీత్ తన 8 బౌండరీలు 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 40 పరుగులు రాబట్టాడు. ఈ విధంగా ఇద్దరూ కలిసి 19 బంతుల్లో 94 పరుగులు కొల్లగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..