Unbreakable Cricket Records in Telugu: క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు లేదా ఓవర్‌లో 4 వికెట్లు వంటి రికార్డులను ఇప్పటికే ఎన్నో చూశాం. అయితే, ఒకే బంతికి ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 286 పరుగులు సాధించారని చెబితే నమ్ముతారా? కానీ, ఇది నిజంగా జరిగింది. దీంతో ఇది క్రికెట్ చరిత్రలో అతిపెద్ద అద్భుతం అంటూ పేరుగాంచింది. 130 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘనతను నేటికీ నమ్మడం కష్టంగానే ఉంటుంది. ఆనాడు అసలేం జరిగిందో ఓసారి చూద్దాం..
ఈ సంఘటన 1894లో పశ్చిమ ఆస్ట్రేలియాలో విక్టోరియా వర్సెస్ స్క్రాచ్- XI మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. క్రికెట్ విశ్వసనీయ వెబ్‌సైట్ ESPN క్రిక్‌ఇన్ఫో కూడా ఈ రికార్డు గురించి వివరించింది. నివేదిక ప్రకారం, ఈ సంఘటన ఒక వార్తాపత్రికలో ప్రస్తావించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి ఒకే బంతికి 286 పరుగులు చేశారు. పరుగుల లెక్కింపులో అంపైర్లు కూడా గందరగోళానికి గురయ్యేలా చేశారంట.
విక్టోరియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. జట్టులోని ఒక బ్యాట్స్‌మెన్ అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే, బంతి వెళ్లి బౌండరీ లైన్ లోపలే ఉన్న కొమ్మ మధ్యలోని చిక్కుకపోయింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడం ప్రారంభించారు. ఫీల్డింగ్ జట్టు కూడా బంతిని కోల్పోయిన కారణంగా స్కోర్‌కార్డ్‌ను నిలిపివేయాలని అంపైర్‌లకు విజ్ఞప్తి చేసింది. కానీ, బ్యాట్స్‌మెన్స్ బంతి దృష్టిలో ఉందని, అప్పీల్‌ను తిరస్కరించారు. బ్యాట్స్‌మెన్‌లు దాదాపు 6 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. స్కోరు బోర్డుపై 286 పరుగులు చేరాయి.
నివేదిక ప్రకారం, ఫీల్డింగ్ జట్టు బంతిని డౌన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, బంతి కిందికి రాలేదు. ఆ తర్వాత అతను చెట్టును నరికి బంతిని తీయడానికి మైదానంలో గొడ్డలిని తీసుకురావాలని కోరాడు. కానీ, గొడ్డలి దొరకలేదు. ఆ తర్వాత రైఫిల్‌తో బంతిని గురిపెట్టి పేల్చారంట. అప్పటికే ఇద్దరు బ్యాటర్లు 286 పరుగులు చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..