T20 Cricket: ఇదెక్కడి టీ20 మ్యాచ్ మావ.! 96 బంతుల్లో 192 పరుగులు.. తీరా చివర్లో ట్విస్ట్ అదే

టీ20ల్లో మీరెప్పుడూ చూడని మ్యాచ్ ఇది. మాములుగా ఓ టీ20 మ్యాచ్‌లో ఒకే రకంగా ఇద్దరు లేదా ముగ్గురు బ్యాటర్లు ఔట్ అవుతారు. కానీ ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 మంది ఒకేలా ఔట్ అయ్యారు. మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం..

T20 Cricket: ఇదెక్కడి టీ20 మ్యాచ్ మావ.! 96 బంతుల్లో 192 పరుగులు.. తీరా చివర్లో ట్విస్ట్ అదే
Uae Vs Kht

Updated on: May 11, 2025 | 10:48 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో సంచలనం నమోదైంది. బ్యాంకాక్ వేదికగా యూఏఈ, ఖతర్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఇందులో 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 16 ఓవర్లకు ఒక్క వికెట్ కోల్పోకుండా 192 పరుగులు చేసింది. టీ20ల్లో ఇన్నింగ్స్ డిక్లరేషన్ రూల్ లేకపోవడంతో, వర్షంతో గెలిచే అవకాశం కోల్పోకుండా బ్యాటర్లంతా రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. మొత్తంగా టీంలోని అందరు బ్యాటర్లు ఇలా ఔట్ కావడం క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం. ఆ తర్వాత ఖతర్ జట్టు 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో యూఏఈ 163 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఎనిమిది మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఉమెన్స్ టీ20లోనే ఇదే అత్యుత్తమ చెత్త గణాంకాలు.

యూఏఈ ఓపెనర్లు ఈషా ఓజా 113 పరుగులు చేయగా.. తీర్థా సతీష్ 74 పరుగులు సాధించింది. 51 బంతుల్లో టీ20ల్లో తన నాలుగో శతకాన్ని ఓజా నమోదు చేయగా.. సతీష్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది. ఇక ఖతర్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంలో యూఏఈ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మిచెల్ బోథా 11 పరుగులకు మూడు ప్రధాన వికెట్లు పడగొట్టింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..