దుబాయ్‌లో జరుగుతోన్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. టైటిల్ సొంతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఒకవైపు సెమీఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించగా, మరోవైపు రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకుంది. టోర్నీలో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడి ఫైనల్‌లోకి ప్రవేశించగా, ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.కాగా ఆసియాకప్ లో బంగ్లాదేశ్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. తద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ను చేజిక్కించుకోవడంపై ఆ జట్టు చూపు పడింది. 2023లో యూఏఈని ఓడించి బంగ్లాదేశ్ అండర్ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టుతో టీమ్‌ఇండియా కూడా అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఉంది.
ACC పురుషుల అండర్-19 ఆసియా కప్‌లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపై ఉంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ మరో 170 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ 67 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కాబట్టి ఫైనల్ మ్యాచ్ లోనూ మెరిసిపోతే టీమిండియా ఛాంపియన్ గా నిలవడం ఖాయం.
2️⃣ teams, 1️⃣ trophy
𝙄𝙩 𝙖𝙡𝙡 𝙘𝙤𝙢𝙚𝙨 𝙙𝙤𝙬𝙣 𝙩𝙤 𝙩𝙝𝙞𝙨.After 7 thrilling days of non-stop cricket, the moment of truth has finally arrived!
Welcome to the finals of the #ACCMensU19AsiaCup 2024 edition! 🏆𝕃𝕖𝕥 𝕥𝕙𝕖 𝕒𝕔𝕥𝕚𝕠𝕟 𝕓𝕖𝕘𝕚𝕟! ⚔️#ACC pic.twitter.com/EJtJW3BjBb
— AsianCricketCouncil (@ACCMedia1) December 7, 2024
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ లో ఈ మ్యాచ్ ను లైవ్ చూడొచ్చు. అలాగే సోనీ లైవ్ యాప్‌లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
అండర్ 19 టీమ్ ఇండియా: మహ్మద్ అమన్ (కెప్టెన్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్థ్ సి, కెపి కార్తికేయ, నిఖిల్ కుమార్, కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధ్‌జీత్ గుహా, అనురాగ్ కవాడే, సమర్త్ నాగరాజ్ , మొహమ్మద్ ఎనాన్, ప్రణవ్ పంత్.
బంగ్లాదేశ్ అండర్-19 జట్టు: మహ్మద్ అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), మహ్మద్ ఫరీద్ హసన్ ఫైసల్ (వికెట్ కీపర్), జవాద్ అబ్రార్, కలాం సిద్ధిఖీ అలిన్, మహ్మద్ షిహాబ్ జేమ్స్, దేబాశిష్ సర్కార్ దేబా, మహ్మద్ రఫీ ఉజ్జమాన్ రఫీ, మహ్మద్ సమీ, మహ్మద్ సమీ, మహ్మద్ సమీ అల్ ఫహద్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, MD రిజాన్ హుస్సేన్, అష్రాఫుజ్జమాన్ బోరెనో, MD రిఫత్ బేగ్, సాద్ ఇస్లాం రజిన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..