Viral Video: ముద్దుగా ఉందని.. ముద్దు చేయబోయింది.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరంతే..

Alpaca Trending Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. యూజర్లకు నచ్చడంతో వీటిని తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Viral Video: ముద్దుగా ఉందని.. ముద్దు చేయబోయింది.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరంతే..
Alpaca Trending Video

Updated on: Apr 15, 2023 | 7:15 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. యూజర్లకు నచ్చడంతో వీటిని తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. సరదాగా గడిపే క్రమంలో ఓ మహిళ చేసిన చిలిపి పనితో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరనడంలో ఎలాంటి సందేహం లేదు.

చాలా మంది జంతువులతో సరదాగా గడిపేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు మాత్రం చిక్కుల్లో పడుతుంటారు. ఈ వైరల్ వీడియోలోనూ అలాంటిదే జరిగింది. ఒక మహిళ అల్పాకాను ముద్దు పెట్టుకోవడానికి సరదాగా ప్రయత్నించింది. అల్పాకాను ముద్దు పెట్టుకోవడానికి దగ్గరగా వెళ్లింది. ఇంతలో అల్పాకా సదరు మహిళపై గాండ్రించి ఉమ్మివేసింది. దీంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఈ సరదా సన్నివేశాన్ని చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ‘taninmisphenomen’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. అదే సమయంలో వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తోంది. జంతువులతో సరదాగా ఉండడం తప్పుకాదు. కానీ, కొన్నిసార్లు ఇలాంటివే ఎదురవుతుంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. జంతువులకు ముద్దులు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటూ మరికొంతమంది హితవు పలికారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us