గ్రూప్ మ్యాచ్‌లకు వద్దు.. నాకౌట్‌కే ముద్దు.. పెద్ద ప్లాన్‌తోనే బరిలోకి ఆస్ట్రేలియా.. అదేంటంటే?

Australian Knockouts Matches: అన్ని జట్లు ఓ ప్లాన్‌తో బరిలోకి దిగితే.. ఆస్ట్రేలియా జట్టు మాత్రం భారీ స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్ 2026 బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఓ డేంజస్ ప్లేయర్‌ను గ్రూప్ మ్యాచ్‌ల నుంచి తప్పించి, కేవలం నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే ఫిక్స్ చేసింది.

గ్రూప్ మ్యాచ్‌లకు వద్దు.. నాకౌట్‌కే ముద్దు.. పెద్ద ప్లాన్‌తోనే బరిలోకి ఆస్ట్రేలియా.. అదేంటంటే?
Australia T20i Squad

Updated on: Feb 10, 2026 | 10:52 AM

భారత్, శ్రీలంకలో జరుగుతోన్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు జోరుగా ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే, ఆస్ట్రేలియా జట్టు మాత్రం పెద్ద ప్లాన్ తో గ్రూప్ మ్యాచ్ లు ఆడుతోంది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెలన్నర క్రితం, హోబర్ట్ హరికేన్స్ తరపున జరిగిన బీబీఎల్ 2025-26 మ్యాచ్ సందర్భంగా ఈ హార్డ్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గ్రేడ్ 2 స్నాయువు గాయంతో బాధపడ్డాడు. గాయం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా టిమ్ డేవిడ్‌ను పాకిస్తాన్‌కు వెళ్లే టీం నుంచి మినహాయించింది. అయితే, భారత ఉపఖండంలో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఈ డేంజరస్ ప్లేయర్ ను తిరిగి పిలిచింది.

ఆస్ట్రేలియా జట్టులోకి రీఎంట్రీ.. కానీ షరతులతో..

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు తాను దూరమయ్యే అవకాశం ఉందని టిమ్ డేవిడ్ సూచించాడు. గాయం కారణంగా పాకిస్తాన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20ఐ సిరీస్‌కు దూరమైన తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

టోర్నమెంట్ చివరి దశలకు అంటే, గ్రూప్ మ్యాచ్ ల తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా టిమ్ డేవిడ్‌ను రంగంలోకి దింపాలని చూస్తోందంట. స్నాయువు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, ఈ 29 ఏళ్ల హార్డ్ హిట్టర్ ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

టిమ్ డేవిడ్ మాట్లాడుతూ, గ్రూప్ దశలో జట్టుకు దూరంగా ఉంటానని తనకు తెలుసునని, నేను కొంచెం సేపు బ్యాటింగ్ చేయాలనుకున్నాను, కానీ మేనేజ్మెంట్ మాత్రం కొంచెంసేపు వెయిట్ చేయండి’ అని తెలిపిందంటూ చెప్పుకొచ్చాడు.

ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఓమన్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం..

ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం టిమ్ డేవిడ్‌కు గ్రూప్ దశ నుంచి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ఆడే మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 11న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఆస్ట్రేలియా జట్టు తన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

ఆస్ట్రేలియాను వెంటాడుతోన్న గాయాల బాధలు..

గాయం నుంచి ఇటీవల కోలుకున్న టిమ్ డేవిడ్‌ను ఆస్ట్రేలియా జట్టు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2021 విజేత జట్టు ఇప్పటికే అనేక ఇతర గాయాల సమస్యలతో బాధపడుతోంది. గత నెల చివర్లో, ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.

2025-26 BBL సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్ స్థానంలో బెన్ ద్వార్షుయిస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

తోటి లెజెండరీ పేస్‌మన్ జోష్ హేజిల్‌వుడ్ కూడా రెండు రోజుల క్రితం పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 2025-26 యాషెస్ సిరీస్‌ను కూడా హాజిల్‌వుడ్ పూర్తిగా కోల్పోయాడు.

మిచెల్ మార్ష్ నాయకత్వంలో, ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ గ్రూప్ B దశను ఎదుర్కోనుంది. షెడ్యూల్ ప్రకారం, ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో, ఫిబ్రవరి 13న జింబాబ్వేతో, ఫిబ్రవరి 16న శ్రీలంకతో, ఫిబ్రవరి 20న ఒమన్‌తో పోటీ పడనుంది. గ్రూప్ B మ్యాచ్‌లకు కొలంబో, కాండీ ఆతిథ్యం ఇస్తాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..