
Tilak Varma Catch Record: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత ఆల్‌రౌండర్ తిలక్ వర్మ (Tilak Varma) అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు.
మ్యాచ్ తొలి మూడు ఓవర్లలోనే తిలక్ వర్మ రెండు కీలక క్యాచ్‌లు పట్టాడు. టిమ్ సీఫర్ట్ (Tim Seifert), డారిల్ మిచెల్ (Daryl Mitchell) క్యాచ్‌లను అందుకోవడంతో అతడి ఖాతాలో ఈ ఏడాది క్యాచ్‌ల సంఖ్య 26కి చేరింది.
ఎక్కువమంది చదివినది: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డ్.. ఒకే ఏడాదిలో దుమ్మురేపాడుగా..!
దీంతో ఇప్పటివరకు ఈ రికార్డు పేరిట ఉన్న డానిల్సన్ హవో (Danilson Hawo)ను తిలక్ అధిగమించాడు. ఇండోనేషియా ఆటగాడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 25 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజాగా 26 క్యాచ్‌లతో తిలక్ వర్మ కొత్త రికార్డు నెలకొల్పాడు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ 2nd T20I: 1434 రోజుల తర్వాత తొలి వికెట్.. ఆ విమర్శలకు ఇచ్చిపడేసిన స్వింగ్ హీరో..!
టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తిలక్ వర్మ కీలకంగా మారుతున్నాడని ఈ రికార్డు మరోసారి చూపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..