IPL 2023: వేలంలో కోట్లు పోసి కొన్నారు.. కట్ చేస్తే.. జీరోలుగా మిగిలారు.. ఆ ప్లేయర్స్ ఎవరంటే!

|

May 11, 2023 | 2:03 PM

ఐపీఎల్ 2023 చివరి స్టేజీకి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ సీజన్‌లో కొంతమంది ఫ్రాంచైజీలు..

1 / 5
ఐపీఎల్ 2023 చివరి స్టేజీకి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ సీజన్‌లో కొంతమంది ఫ్రాంచైజీలు.. కొందరి ఆటగాళ్లను కోట్లు పోసి కొన్నారు. తీరా బరిలోకి దిగేసరికి జీరోలుగా మారారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

2 / 5
సామ్ కర్రన్: ఈ ఆటగాడిని రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో సామ్ కర్రన్ పెర్ఫార్మన్స్ అంతంత మాత్రమేనని చెప్పాలి. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా.. మిగిలిన వాటిలో కర్రన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన కర్రన్ 10.28 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్‌తో 196 పరుగులు చేశాడు.

3 / 5
బెన్ స్టోక్స్:   ఈ ఇంగ్లీష్ ప్లేయర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టోక్స్.. 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఆ తర్వాత నుంచి గాయం కారణంగా బరిలోకి దిగలేదు.

4 / 5
హ్యారీ బ్రూక్:   ఈ సీజన్‌లో రూ. 13.25 కోట్లకు అమ్ముడైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 163 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో ఒక్క సెంచరీ ఉంది.

5 / 5
మయాంక్ అగర్వాల్:   రూ. 8.25 కోట్లతో ఈ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఓపెనర్‌గా మయాంక్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పొచ్చు. హైదరాబాద్ జట్టుకు కావాల్సిన ఓపెనింగ్ పార్టనర్‌షిప్ ఇప్పటిదాకా అందించలేకపోయాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 187 పరుగులు చేశాడు. లిస్టులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు.