AUS Vs ENG: అప్పుడు 59.. ఇప్పుడు గుండు సున్నా.. హీరో అనుకుంటే జీరో అయ్యాడేంట్రా.. ఈ తోపు బౌలర్ ఎవరంటే.?

పెర్త్ టెస్ట్ దద్దరిల్లిపోయింది. తొలి రోజు బౌలర్లు ఊచకోత కోశారు. అటు స్టార్క్.. ఇటు బెన్ స్టోక్స్.. విరుచుకుపడ్డారు. ఒకరు ఏడు వికెట్లు తీయగా.. ఇంకొకరు ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

AUS Vs ENG: అప్పుడు 59.. ఇప్పుడు గుండు సున్నా.. హీరో అనుకుంటే జీరో అయ్యాడేంట్రా.. ఈ తోపు బౌలర్ ఎవరంటే.?
Scott Boland

Updated on: Nov 21, 2025 | 8:42 PM

జట్టుకు ప్రధాన బౌలర్‌గా రాణించాలంటే.. అందరి పని కాదు. ఎంత తోపు బౌలర్ అయినప్పటికీ.. ఎప్పుడోకప్పుడు ఫెయిల్ అవ్వాల్సిందే. సరిగ్గా ఇక్కడొక బౌలర్ కూడా అంతే.! ప్రధాన బౌలర్లలో ఒకరు గాయం కారణంగా వైదొలిగిన ప్లేస్‌లో వచ్చి.. అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు మెయిన్ బౌలర్‌గా మారి.. అట్టర్ ప్లాప్ అయ్యాడు. మరి అతడెవరో కాదు.. స్కాట్ బొలాండ్. పెర్త్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ మొదలైంది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఆసీస్ పేస్ ద్వయం ప్యాట్ కమిన్స్, జోష్ హెజిల్‌వుడ్ దూరమయ్యారు. ఇక హెజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన బొలాండ్.. ప్రధాన బౌలర్‌గా తన కోటా మొదలుపెట్టాడు. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా అదరగొడతాడని అందరూ అనుకుంటే.. బొక్కబోర్లాపడ్డాడు.

10 ఓవర్లు వేస్తే.. వికెట్ తీయకుండా 62 పరుగులు ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు.. మరీ ముఖ్యంగా స్టార్క్.. తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. యాషెస్ టెస్ట్ మొదటి రోజు ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. అటు ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఏడు వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టాక్స్ ఐదు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్, హెజిల్‌వుడ్, స్టార్క్‌లో ఒకరు లేని సమయంలో జట్టులోకి వచ్చే బొలాండ్.. వచ్చిన ప్రతీసారి వికెట్లు పడగొట్టాడు. అలా 24 ఇన్నింగ్స్‌లలో 15.52 యావరేజ్‌తో 59 వికెట్లు పడగొట్టాడు. ఇక కొత్త బంతితో అయితే 4 ఇన్నింగ్స్‌లలో 46 యావరేజ్‌తో 3 వికెట్లు తీశాడు.