India New Jersey on burj khalifa: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్రపంచ కప్ 2021కి మరో రెండు రోజులే సమయం ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్‌లో పాల్గోనే భారత జట్టు ధరించే జెర్సీని బుధవారం బీసీసీఐ విడుదల చేసింది. మెన్ ఇన్ బ్లూ కోసం తాజా జెర్సీని టీమ్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ తయారుచేసింది. అయితే టీ20 ప్రపంచ కప్ జెర్సీ విడుదలైన రోజునే దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం విశేషం.
అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత క్రికెట్ జట్టు ‘బిలియన్ చీర్స్ జెర్సీ’ని విడుదల చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) జెర్సీని ఆవిష్కరించంది. ప్రష్యన్, రాయల్ బ్లూ జెర్సీ డిజైన్‌ను బిలియన్ అభిమానుల ఉత్సాహంతో స్ఫూర్తి పొంది రూపొందించినట్లు వెల్లడించింది. బుధవారం సాయంత్ర విడుదల చేసిన వెంటనే.. ఈ జెర్సీ ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ప్రదర్శించారు. ప్రపంచంలోని ఎత్తైన భవనంపై సాయంత్రం లైట్లలో టీమిండియా జెర్సీతోపాటు దానిని ధరించిన భారత ఆటగాళ్ల ఫొటోలను ప్రదర్శించారు.
ఎంపీఎల్ స్పోర్ట్స్ రూపొందించిన టీమిండియా కొత్త కిట్ ఐకానిక్ బిల్డింగ్‌పై ప్రదర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇండియా జెర్సీ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఇదే మొదటిసారి అని ఎంపీఎల్ కంపెనీ కూడా వెల్లడించింది. ఈమేరకు ఈ వీడియోను షేర్ చేస్తూ.. “బుర్జ్ ఖలీఫాపై బిలియన్ చీర్స్ జెర్సీ. మొట్టమొదటిసారిగా టీం ఇండియా జెర్సీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపైకి వెళ్లింది. టీమిండియాకు మద్దతు ఇవ్వడానికి సమయం వచ్చింది ” అంటూ ఎంపీఎల్ రాసుకొచ్చింది. అక్టోబర్ 18, 20 తేదీలలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లలో మెన్ ఇన్ బ్లూ జెర్సీని ధరించనుంది.
భారత టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్
ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, భారతదేశం రెండు వార్మప్ గేమ్‌లను ఆడనుంది. ఒకటి ఆస్ట్రేలియాతో, రెండోది దక్షిణాఫ్రికా టీంతో ఆడనుంది. రెండు వార్మప్ గేమ్‌లు అక్టోబర్ 18, అక్టోబర్ 20 తేదీలలో ఆడనుంది. సూపర్ 12 దశ అక్టోబర్ 23 న అబుదాబిలో ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గ్రూప్ 1 మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 24 న భారతదేశం తన మొదటి మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచులు సాయంత్రం 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మరలా అక్టోబర్ 31 న న్యూజిలాండ్‌తో, తర్వాత నవంబర్ 3 న ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా ఆడనుంది. ఇంకా రెండు మ్యాచ్‌లు నిర్ణయించాల్సి ఉంది. నవంబర్ 5, నవంబర్ 8 న మరో రెండు మ్యాచుల ఆడనుంది.
మొదటి సెమీ ఫైనల్ అబుదాబిలో నవంబర్ 10 న, రెండవ సెమీ ఫైనల్ దుబాయ్‌లో నవంబర్ 11 న జరుగుతాయి. అయతే ఈ రెండు సెమీ ఫైనల్‌లకు రిజర్వ్ డేలు ఉన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో నవంబర్ 14న ఆదివారం జరుగుతుంది. ఫైలన్ మ్యాచుకు సోమవారం రిజర్వ్ డేగా ఉంచారు.
భారత టీ 20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైప్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా , భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ
రిజర్వ్‌డ్ ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
Indian jersey showcasing at Burj Khalifa. pic.twitter.com/FCaSR0yUDE
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2021