
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంటోంది. ఓడిపోతే పర్లేదు.. కానీ దారుణంగా పరాజయం పాలవుతోంది. కేవలం 76 పరుగులకే కుప్పకూలి, 100కు పైగా పరుగుల తేడా ఓడిపోవడం నిజంగా అవమానమే. ఎందుకంటే.. టీమిండియా అంటే సాధారణ టీమ్ కాదు.. వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టు. అలాంటి టీమ్.. ఇప్పుడు వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. పైగా రెండు పసికూన ఐర్లాండ్‌పై మరో రెండు ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 రద్దు అయింది. లేకుంటే ఓటముల సంఖ్య ఐదుకు చేరి ఉండేదని కొంతమంది విమర్శిస్తున్నారు.
ఒకటీ రెండు మ్యాచ్‌లు అంటే ఏమైనా అనుకోవచ్చు. కానీ వరుసగా 4 మ్యాచ్‌లు అంటే మాత్రం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన అంశమే. పైగా ఓడిపోవడం కూడా అసలు పోటీ ఇవ్వకుండా పసికూన ప్రదర్శనతో చెత్తగా ఓడిపోతుంది. మరి ఈ దుస్థితికి కారణం ఏంటని ప్రతి క్రికెట్ అభిమాని మెదడులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. దాని ప్రధాన కారణం.. రాంగ్ టీమ్ సెలెక్షన్ అనే చెప్పాలి. దాంతో పాటు అనుభవం లేమి కూడా టీమిండియాను ఇబ్బంది పెడుతున్న అంశం. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఉన్న కోపం టీమిండియాకు తీవ్ర నష్టం చేస్తోందని కొంతమంది క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. దానికి వాళ్లు చెప్పే కారణాలు కూడా కాస్త రీజనబుల్‌గా ఉన్నాయి. అవేంటంటే..
ఐపీఎల్ ప్రదర్శన చూసి.. కొన్నేళ్లుగా భారత టీ20 టీమ్‌లోనే ఆటగాడిని తీసుకొచ్చి కెప్టెన్ చేసినప్పుడు, అదే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వరుసగా రెండు కప్పులు గెలిచి, బ్యాటర్‌గా అదరగొడుతూ, అద్భుతమైన స్ట్రైక్ రేట్, స్పిన్‌ను సూపర్‌గా ఆడే ప్లేయర్ రజత్ పాటిదార్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ఇప్పుడు గట్టి ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ప్రాతిపదికన చాలా మంది ప్లేయర్లను ఎంపిక చేశారు కానీ, వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ నుంచి మాత్రం ప్లేయర్లను సెలెక్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ అంటే రిటైర్మెంట్ ఇచ్చాడు.. మరీ అదే టీమ్‌లో అదరగొట్టిన రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కర్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, కృనాల్ పాండ్యా లాంటి ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు.
కానీ, ఇంగ్లాండ్ మాత్రం ఆ తప్పు చేయలేదు. ఆర్సీబీలో ఆడిన ఫిల్ సాల్ట్, జాకబ్ బెతెల్, జోర్డాన్ కాక్స్ వంటి ప్లేయర్లను తమ టీమ్‌లోకి తీసుకుంది. పైగా సాల్ట్ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా అతనిపై విశ్వాసం ఉంచింది. తీరా చూస్తే.. టీమిండియాను రెండో టీ20లో జాకబ్ బెతెల్, మూడో టీ20లో ఫిల్ సాల్ట్ ఓడించారు. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కానీ టీమిండియా మాత్రం మన ప్లేయర్లను కనీసం లెక్కలేయలేదు. వాషింగ్టన్ సుందర్ బదులు కృనాల్ పాండ్యాను తీసుకుంటే కాస్త అయినా ఇంప్యాక్ట్ ఉండేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నార. 2026 సీజన్‌లో దుమ్మురేపిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంటే.. ఏజ్ సాకు చూపించారు, కానీ రసిక్ సలామ్ దార్ వంటి యంగ్ బౌలర్‌ను తీసుకోవచ్చు కదా.. లేదు. గుజరాత్ టైటాన్స్ నుంచి ప్లేయర్లను ఎత్తుకొచ్చి మరీ టీమిండియాలో పెట్టేశారు. ప్రసిద్ధ్ కృష్ణ ఎంత దారుణంగా విఫలం అయ్యాడు కళ్లారా చూశాం అని క్రికెట్ లవర్స్ విమర్శిస్తున్నారు. ఇలా ఆర్సీబీ ప్లేయర్లకు అన్యాయం జరిగేందుకు విరాట్ కోహ్లీపై, గౌతమ్ గంభీర్‌కు ఉన్న కోపమే కారణం అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి