
Indian Cricket Team: ఇటీవలే భారత జట్టు ఆసియా కప్ (Asia Cup) టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మొత్తం టోర్నీలో టీమిండియా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీ భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి కూడా ప్రత్యేకమైనది.

భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీ సాధించాడు. ఆసియా కప్ తర్వాత కూడా కోహ్లీ ఈరోజుల్లో వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం అతని బ్యాటింగ్ కాదు.. పంజాబీ సింగర్ శుభ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో వార్తల్లో నిలిచాడు.

కెనడాకు చెందిన పంజాబీ రాపర్ శుభ్‌ను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అన్‌ఫాలో చేశాడు. వాస్తవానికి, శుభ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో పంజాబ్, హర్యానాలను ప్రత్యేక దేశాలుగా చూపించారు. శుభ్ ఈ పోస్ట్ తరువాత, భారతదేశంలో అతనిపై చాలా విమర్శలు వినిపించాయి. అతను ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారుడని కూడా ఆరోపించారు. ఈ సంఘటన తర్వాత, విరాట్ కోహ్లీ కూడా ఈ గాయకుడిని అన్‌ఫాలో చేశాడు.

IPL 2023 సమయంలో విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కూడా జిమ్‌లో శుభ్ ఎలివేటెడ్ పాటలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. కోహ్లీ, అనుష్కల ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత జట్టు లెజెండరీ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాట్ ఆసియా కప్ 2023లో కూడా ఆడింది.

ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై కోహ్లి 122 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను పాకిస్థాన్‌కు చెందిన ప్రతి బౌలర్‌పై విరుచుకపడ్డాడు. కోహ్లిపై పాకిస్థాన్ జట్టులోని ఏ బౌలర్ కూడా సమర్థంగా రాణించలేకపోయాడు. రానున్న ప్రపంచకప్‌లో కూడా కోహ్లీ బ్యాట్ ఇలాగే రాణిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.