Sudhir Kumar Chaudhary: సచిన్ టెండూల్కర్‌‌ వీరాభిమానిపై పోలీసుల దాడి..!

|

Jan 22, 2022 | 8:31 AM

సచిన్ టెండూల్కర్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా వీరాభిమానిగా పేరుగాంచిన సుధీర్ కుమార్ చౌదరిపై పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Sudhir Kumar Chaudhary: సచిన్ టెండూల్కర్‌‌ వీరాభిమానిపై పోలీసుల దాడి..!
Sachin Tendulkar Fan Sudhir Kumar Chaudhary
Follow us on

Sudhir Kumar Chaudhary: సచిన్ టెండూల్కర్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా వీరాభిమానిగా పేరుగాంచిన సుధీర్ కుమార్ చౌదరిపై పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ ఆఫీసర్ గురువారం రాత్రి కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సుధీర్ కుమార్ చౌదరి సోదరుడు కిషన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వార్త విని సుధీర్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈమేరకు సుధీర్ మాట్లాడుతూ, “నా సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఈ విషయం గురించి ఆరా తీసేందుకు నేను అక్కడికి వెళ్లాను. లాకప్‌లో ఉన్న మా అన్నతో మాట్లాడుతుండగా, డ్యూటీ ఆఫీసర్ వచ్చి నాతో దుర్భాషలాడాడు. అతను నన్ను రెండుసార్లు తన్నాడు. పోలీస్ స్టేషన్ వదిలి వెళ్ళమని ఆదేశించాడు. అతను నాతోపాటు, నా సోదరుడిని కూడా అసభ్య పదజాలంతో దూషించాడు” అని తెలిపాడు.

సంఘటన జరిగిన తరువాత, సుధీర్ ఆ ఏరియా ఎస్‌డీపీఓ రామ్ నరేష్ పాశ్వాన్‌కు సమాచారం అందించాడు. ఈ విషయంపై సరైన విచారణకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం ఇదే ముజఫర్‌పూర్‌ పోలీసులు పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్‌ కుమార్‌ తెలిపాడు.

“అప్పట్లో వాళ్లు నన్ను సెలబ్రిటీలా చూసుకున్నారు. నేను ప్రారంభించిన అదే పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నన్ను అవమానించడమే కాకుండా కొట్టడం చాలా బాధించింది. ఇది సామాన్యుడి పట్ల పోలీసుల వైఖరిని తెలియజేస్తోంది” అంటూ వాపోయాడు.

భూమి విక్రయం కేసులో కిషన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పద స్థల ఒప్పందానికి అతను ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు ప్రకటించారు.

Also Read: IPL 2022: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఫిక్స్.. రిటైన్ లిస్టులో మరో ఇద్దరు ఎవరంటే?

IPL 2022: అహ్మదాబాద్ సారథిగా భారత ఆల్‌రౌండరే.. ముగ్గురు ప్లేయర్లను ప్రకటించిన ఫ్రాంచైజీ.. వారెవరంటే?