Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ?

|

Jan 14, 2025 | 3:47 PM

Rohit Sharma With Mumbai Ranji Trophy Team: బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 31 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 6.20 సగటుతో మాత్రమే పరుగులు సాధించాడు. అందుకే టీమిండియా కెప్టెన్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నాడు.

Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ?
Ind Vs Aus 5th Test Rohit Sharma
Follow us on

Rohit Sharma With Mumbai Ranji Trophy Team: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ హిట్‌మ్యాన్ 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు పేలవమైన ఫామ్ నుంచి బయటపడేందుకు రోహిత్ శర్మ మళ్లీ ప్రాక్టీస్‌లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ముంబై రంజీ జట్టుతో కావడం గమనార్హం.

అవును, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ముంబైలో రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేయాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు. వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, ముంబైలోని MCA-BKC మైదానంలో రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి టీమిండియా కెప్టెన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి అనుమతి పొందాడు.

దీని ప్రకారం జనవరి 14 నుంచి ముంబై జట్టుతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీ నుంచి నిష్క్రమించిన ముంబై జట్టు జనవరి 23న ప్రారంభం కానున్న రెండో దశ రంజీ ట్రోఫీకి సన్నాహాలు ప్రారంభించనుంది.

రోహిత్ శర్మ రంజీ టోర్నీ ఆడతాడా?

ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటి వరకు రోహిత్ శర్మ ఖాళీగా ఉంటాడు. దీంతో హిట్‌ మ్యాన్ ఈసారి రంజీ టోర్నీ ఆడతాడా అనే ప్రశ్న తలెత్తింది.

ఎందుకంటే, ముంబై జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్న రోహిత్ శర్మ రంజీ టోర్నీ ద్వారా మళ్లీ ఫామ్ చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత.. దేశవాళీ టోర్నీలు ఆడాలని టీమ్ ఇండియా కోచ్ గౌతం గంభీర్ అందరికీ సూచించాడు. అందుకే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఫాంను వెదుక్కుంటూ రోహిత్ శర్మ రంజీ టోర్నీలోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో కనిపించడం లేదు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమవుతుంది. దీని ద్వారా కోహ్లీ, రోహిత్ వైట్ బాల్ క్రికెట్‌కు తిరిగి రానున్నారు. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది…

1వ టీ20: జనవరి 22 (చెన్నై)

2వ టీ20: జనవరి 25 (కోల్‌కతా)

3వ T20I: జనవరి 28 (రాజ్‌కోట్)

4వ టీ20: జనవరి 31 (పుణె)

5వ టీ20: ఫిబ్రవరి 2 (ముంబై)

1వ వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్)

2వ వన్డే: ఫిబ్రవరి 9 (కటక్)

3వ వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్).

మరిన్ని క్రీడా వార్తల కో సం ఇక్కడ క్లిక్ చేయండి..