ప్రపంచకప్‌‌నకు ముందుగా ఈ 3గురి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. పక్కనపెట్టేసిన బీసీసీఐ.. ఎవరంటే?

ఒకప్పుడు జట్టుకు కీలక విజయాల్లో భాగస్వాములైన ముగ్గురు ప్లేయర్స్‌ను బీసీసీఐ విస్మరిస్తోంది. తాజాగా వీరిలో ఇద్దరిపై వేటు వేసి.. ఒకరిని రెడ్-బాల్ ఫార్మాట్‌కు మాత్రం అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఈ ముగ్గురు చోటు దక్కించుకోవడం అసాధ్యంగా మారింది. దాదాపుగా ఈ ముగ్గురి వన్డే కెరీర్ క్లోజ్ అని చెప్పొచ్చు.

ప్రపంచకప్‌‌నకు ముందుగా ఈ 3గురి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. పక్కనపెట్టేసిన బీసీసీఐ.. ఎవరంటే?
Indian Cricket Team

Updated on: Jul 28, 2023 | 8:28 PM

ఒకప్పుడు జట్టుకు కీలక విజయాల్లో భాగస్వాములైన ముగ్గురు ప్లేయర్స్‌ను బీసీసీఐ విస్మరిస్తోంది. తాజాగా వీరిలో ఇద్దరిపై వేటు వేసి.. ఒకరిని రెడ్-బాల్ ఫార్మాట్‌కు మాత్రం అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఈ ముగ్గురు చోటు దక్కించుకోవడం అసాధ్యంగా మారింది. మరి వారెవరో కాదు.. భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్. నాడు స్వింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఓ వెలుగు వెలిగాడు భువీ. ధోని నేతృత్వంలో ఎన్నో అద్భుతమైన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వరుస గాయాలు కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ.. కొన్ని నెలల క్రితం తిరిగి పునరాగమనం చేసి.. చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అయితేనేం బీసీసీఐ మాత్రం ఇతడ్ని పక్కనపెట్టేసింది.. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో కూడా భువీ పేరు లేదు. ప్రస్తుతం సిరాజ్, షమీలతో పేస్ బలంగా ఉండటంతో వన్డే ప్రపంచకప్‌నకు భువీ ఎంపిక అసాధ్యమేనని చెప్పాలి.

ఇక అశ్విన్ విషయానికొస్తే.. ప్రస్తుతం లాంగ్ ఫార్మాట్ ఒక్కటే ఆడుతోన్న ఈ ఆఫ్ స్పిన్నర్.. తన చివరి వన్డేను గతేడాది జనవరిలో సౌతాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ వన్డేల్లో పునరాగమనం చేయలేదు. వన్డేలకు జట్టులో ప్రస్తుతం రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్నర్‌గానే కాదు.. ఆల్‌రౌండర్‌గానూ ఉన్నాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చక్కగా రాణిస్తుండటంతో.. అశ్విన్ వన్డేలలో ఇకపై చోటు దక్కించుకోవడం అసాధ్యం.

దీపక్ చాహర్.. తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో చక్కటి పేస్‌తో పవర్‌ప్లే ఓవర్లలో బౌలింగ్ చేసిన అతడు.. ఆ తర్వాత గాయాల కారణంగా తన లైన్ అండ్ లెంగ్త్ పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు దీపక్ చాహర్. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించకపోవడంతో.. వన్డే వరల్డ్‌కప్‌నకు ఇతడి ఎంపిక డౌటే.!