T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్

|

Jun 26, 2021 | 10:55 AM

భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనాతో విదేశాలకు తరలనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంక లేదా యూఏఈ లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలిసిందే.

T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్
T20 World Cup 2021
Follow us on

T20 World Cup: భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనాతో తరలనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంక లేదా యూఏఈ లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలిసిందే. అయితే, ఇందులో యూఏఈ ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈమేరకు టీ20 ప్రపంచ కప్‌ ను అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో మొదలు కానుంది. అలాగే నవంబర్ 14న ఫైనల్ జరగనుంది. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్‌ తయారు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తన నిర్ణయాన్ని తెలియజేనుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మొత్తం 16 దేశాలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

యూఏఈలోని మూడు వేదికలు – అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు నిర్వహించనున్నారు. అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

భారత్ లోనే టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించాలని అనుకున్న బీసీసీఐకి రెండు సమస్యలు వచ్చి పడ్డాయి. భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి టాక్స్‌ మినహాయింపు లభించలేదు. అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మరలా విదేశీ ఆటగాళ్లు భారత్ వచ్చేందుకు ఒప్పుకుంటారనే అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దీంతో బీసీసీఐ ఫైనల్‌గా యూఏఈని ఖరారు చేసిందంట.

కొన్ని వారాల క్రితం అన్ని రాష్ట్రసంఘాలతో జరిగిన వర్చువల్ సమావేశంలో బీసీసీఐ పలు వివరాలను తెలియజేసిందంట. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడం ద్వారా బోర్డుకు వచ్చే ఆదాయంలో దాదాపు 41 శాతం ఆదా అవ్వనుందని పేర్కొందంట. అదే భారత్‌లో ప్రపంచకప్‌ నిర్వహిస్తే బీసీసీఐ భారీగా టాక్స్ కట్టాల్సివస్తోందని తెలియజేసిందంట.

కాగా, 2016లో టీ 20 ప్రపంచ కప్‌ నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వ నుంచి పన్ను మినహాయింపు లభించలేదు. దీంతో యూఏఈకి తరలిస్తేనే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త డెల్టా వేరియంట్ భారత్ లో వెలుగుచూడడంతో ఎలాంటి రిస్క్‌ తీసుకోదలుకోలేదని తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. దీంతో ఆటగాళ్ల జర్నీకి ఇబ్బందులు ఉండవని బీసీసీఐ భావిస్తోంది.

Also Read:

ICC Tournaments: ఎంఎస్ ధోనీ నుంచి కేన్‌ విలియమ్సన్‌ వరకు.. 7 ఐసీసీ టోర్నీలలో 7 సార్లు కొత్త విజేతనే!

ENG vs SL: కాలితో రనౌట్ చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్.. క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ చూపించావంటూ నెటిజన్ల కామెంట్లు! వైరలవుతోన్న వీడియో

IND vs ENG: గాయపడిన టీమిండియా పేస్ బౌలర్..! ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు డౌటేనా?

Virat Kohli: భారత సారథిని అవమానించిన న్యూజిలాండ్ వెబ్‌సైట్‌; విరాట్ ఫ్యాన్స్‌ ఆగ్రహం!