
Vamika Photos: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం ట్విట్టర్‌లో తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు. ఫోటోలో, కోహ్లీ, అనుష్క నవ్వుతూ ఉండడం చూడొచ్చు. దుబాయ్‌లో వీరిద్దరూ కుమార్తెతో కలిసి టిఫిన్ చేస్తున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. రెడ్ హార్ట్ ఎమోజీతో కోహ్లీ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. టీ 20 వరల్డ్ కప్ కోసం భారత కెప్టెన్ యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. అనుష్క కూడా ఇటీవల యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్నప్పటి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫొటోలోను వామికా ముఖం కనిపించకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు విరుష్కలు తమ కుమార్తె ముఖాన్ని చూపించలేదు.
రెండు నెలల క్రితం ఫ్యామిలీతో కలిసి ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా క్రికెటర్లు.. అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్నారు. ఐపీఎల్ 2021 అనంతరం ప్రస్తుతం అక్కడే జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ 2021 కోసం మరోసారి క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఇన్నాళ్లుగా క్రికెటర్లతోనే ప్రయాణిస్తున్న ఫ్యామిలీ సభ్యులు.. క్వారంటైన్‌లోనే సరదాగా గడుపుతూ ఫొటోలను నెట్టింట్లో పంచుకుంటున్నారు.
ఇక సోమవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇందులో కోహ్లీ భారీ స్కోరు చేయలేకపోయాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి కేఎల్ రాహుల్ కూడా బాగా అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో అలరించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. నేడు రెండో వార్మప్ మ్యాచులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈమ్యాచులో రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది.
దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఆస్ట్రేలియాతో చివరి వార్మప్ గేమ్‌లో లోపాట్లను అధిగమించాలని భారత్ యోచిస్తోంది.టీ 20 ప్రపంచకప్ పూర్తయిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఇప్పటికే వైదొలిగిన కోహ్లీ, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలగనున్న సంగతి తెలిసిందే.