T20 World Cup 2021: అది అతడికి జట్టుపై ఉన్న నిబద్ధత .. ఆ పాక్ ఆటగాడిని ఆకాశానికెత్తిన వీవీఎస్ లక్ష్మణ్..

పాకిస్తాన్ బ్యాట్స్‎మెన్‎ మహమ్మద్ రిజ్వాన్‎కు జట్టు పట్ల తనకు ఉన్న నిబద్ధతకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడారు. 29 ఏళ్ల రిజ్వాన్ చావుతో పోరాడి జట్టులోకి వచ్చాడని ఇది "ధైర్యం, సంకల్పానికి" గొప్ప ఉదాహరణ అని లని లక్ష్మణ్ చెప్పాడు...

T20 World Cup 2021: అది అతడికి జట్టుపై ఉన్న నిబద్ధత .. ఆ పాక్ ఆటగాడిని ఆకాశానికెత్తిన వీవీఎస్ లక్ష్మణ్..
Laxman

Updated on: Nov 12, 2021 | 4:39 PM

పాకిస్తాన్ బ్యాట్స్‎మెన్‎ మహమ్మద్ రిజ్వాన్‎కు జట్టు పట్ల తనకు ఉన్న నిబద్ధతకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడారు. 29 ఏళ్ల రిజ్వాన్ చావుతో పోరాడి జట్టులోకి వచ్చాడని ఇది “ధైర్యం, సంకల్పానికి” గొప్ప ఉదాహరణ అని లని లక్ష్మణ్ చెప్పాడు. నవంబర్ 9న తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన రిజ్వాన్ దుబాయ్‌లోని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో రెండు రాత్రులు గడిపాడు. ఈ విషయం టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరుకు ముందు చాలా మందికి తెలియదు. అతను కోలుకుని సెమీస్‎లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‎లో పాక్ ఓడినప్పటికీ రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

సెమీఫైనల్ పోరుకు రెండు రోజుల ముందు కోమాలో ఉన్న రిజ్వాన్ తన శరీరమంతా అనేక సెన్సార్లు, డ్రిప్‌లు, మానిటరింగ్ గాడ్జెట్‌లతో ICUలో ఉన్న చిత్రాన్ని లక్ష్మణ్ ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. “ధైర్యం, దృఢసంకల్పం ఇది గొప్ప ఉదాహరణ. పాక్ గెలవకపోవచ్చు కానీ మహ్మద్ రిజ్వాన్ రెండు రోజులు ICUలో ఉండి తిరిగి జట్టులోకి వచ్చి ఆడడం నిజంగా స్ఫూర్తిదాయకం.” అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. నవంబర్ 9న మొహమ్మద్ రిజ్వాన్‎కు ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని పాక్ క్రికెట్ జట్టు వైద్యుడు నజీబ్ సోమ్రూ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. అతను రెండు రాత్రులు ICUలో ఉండి కోలుకున్నాడు. అతను అద్భుతమైన ప్రదర్శన చేశాడని అన్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ అతను ఘనత సాధించాడు. ఈ ఏడాది టీ20లో 826 పరుగులు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తర్వాతి స్థానంలో ఉన్నాడు. 1902లో, క్లెమ్ హిల్ టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన రికార్డు సృష్టించాడు.

Read Also.. Ravi Shastri: రవి శాస్త్రిని కోచ్‎గా నియమించుకునేందుకు ఐపీఎల్ జట్ల ఆసక్తి.. ఇప్పటికే అతడిని సంప్రదించిన ఓ జట్టు యాజమాన్యం..!