T20 World Cup 2021, India vs Pakistan: టీ 20 వరల్డ్ కప్ 2021 లో భారత్ తన మొదటి మ్యాచ్ సమీపిస్తున్నందున, ప్లేయింగ్ XI పై చర్చ కూడా పెరుగుతోంది. ఇంగ్లండ్‌తో సన్నాహక మ్యాచ్ తర్వాత, ఈ విషయం మరింత సంక్లిష్టంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ఆటగాడి స్థానం ప్రమాదంలో పడింది. వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన భువనేశ్వర్ కుమార్ గురించే ప్రస్తుతం మాట్లాడుతోంది. తొలి వార్మప్ మ్యాచులో భువీ 4 ఓవర్ల వేసి 54 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. భువీ లయ చాలా అధ్వాన్నంగా కనిపించింది. దీంతో ప్రస్తుతం అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే చర్చ నడుస్తోంది.
మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ భువనేశ్వర్ కుమార్‌ను తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచనని స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో తేల్చేశాడు. పేలవమైన ప్రదర్శనకు కారణాన్ని మాత్రం పేర్కొనలేదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే, భువీకి బదులుగా శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉండాలని అజిత్ అగార్కర్ తెలిపాడు.
భువీ స్థానంలో శార్దూల్..
అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, ‘విరాట్ కోహ్లీ కేవలం ఆరుగురినే బౌలింగ్ ఎంపికలుగా ఎంచుకునేందుకు ఇష్టపడతాడు. ఒకవేళ పిచ్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటే, మీరు ఐదుగురు బౌలర్లతో వెళ్లవచ్చు. కానీ, పిచ్ ఫ్లాట్‌గా ఉంటే, ఆరుగురితో బరిలోకి దిగాలి. నేను ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో విరాట్ కోహ్లీ మైదానంలోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు’ ఆయన తెలిపారు. ‘జడేజా ఆల్ రౌండర్, అలాగే ప్రస్తుతం ఒక ముఖ్యమైన బ్యాట్స్‌మన్ కూడా. ఒకవేళ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉండాలి’ అని తెలిపాడు.
అశ్విన్ స్థానంలో రాహుల్ చాహర్..
అజిత్ అగార్కర్ పేలవమైన ఫామ్‌లో ఉన్న రాహుల్ చాహర్‌ని టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చూడాలనుకుంటున్నాడు. ఐపీఎల్‌లో దుబాయ్ లెగ్, ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో రాహుల్ చాహర్ పేలవ ప్రదర్శన ఉన్నప్పటికీ, అతను అశ్విన్‌కు బదులుగా అతడిని జట్టులో ఉంచడానికి అనుకూలంగా ఉన్నాడు. ఇది కాకుండా, వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం చేయడానికి కూడా అతను అనుకూలంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ తర్వాత, పరిస్థితి చాలా స్పష్టంగా ఉంటుంది. భారత జట్టు బుధవారం ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో, టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో అక్టోబర్ 24 న తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ICC T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌లో ప్రత్యేక రికార్డులు.. తొలిమ్యాచ్ నుంచి నేటి వరకు..!