టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో సఫరా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర స్టన్నింగ్ క్యాచ్ చేశాడు. ట్రోఫీని ఇక సౌతాఫ్రికా సొంతం చేసుకోవడం దాదాపుగా ఖాయమనుకున్న సమయంలో.. ఈ ఒకే ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పేసింది. టీ20 వరల్డ్ కప్ విజేతగా రెండోసారి భారత్ ఆవిర్భవించేలా చేసింది.
బౌండరీ లైన్ దగ్గర సూర్య కుమార్ ఒడిసి పట్టుకున్నది బంతిని కాదు.. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ చేసిన ఆ అద్భుతమైన క్యాచ్.. సగటు భారత క్రికెట్ అభిమాని మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అనడంలో అతిసయోక్తి లేదు. భారత్‌కు సూర్య క్యాచ్ మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ మండపం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ సన్నివేశం థీమ్‌తో ఈ గణేశ్ మండపాన్ని రూపొందించడం విశేషం. గుజరాత్‌లోని వాపిలో స్థానిక క్రికెట్ అభిమానులు ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు.
సూర్యకుమార్ క్యాచ్ థీమ్‌తో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం..
Suryakumar Yadav’s catch (T20 World Cup Final) theme Ganesh Pandal in Vapi, Gujarat. pic.twitter.com/NNo2BnF883
— RANJAY RAJ ANUGRAH (@RAnugrah707) September 11, 2024
భారత అభిమానుల ప్రార్థనల వల్లే..
కాగా రెండ్రోజుల క్రితం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై భారత క్రికెటర్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థనల వల్లే సాథ్యమయ్యిందని తాను భావిస్తానని చెప్పారు.