చాలా కష్టంగా ఉంది.. ట్రోఫీ తెచ్చినా, టీం నుంచి తీసేశారు.. టీమిండియా ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయం అందించిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఈ పరిణామం తనను ఎంతగానో బాధించిందని అంగీకరించాడు. అయితే కూతురు రాక, భార్య దేవిషా ఇచ్చిన సలహాతో మళ్లీ క్రికెట్‌పై ప్రేమ, పాత ఉత్సాహాన్ని తిరిగి పొందానని వెల్లడించాడు.

చాలా కష్టంగా ఉంది.. ట్రోఫీ తెచ్చినా, టీం నుంచి తీసేశారు.. టీమిండియా ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!
Suryakumar Yadav Comments On Bad Phase

Updated on: Nov 11, 2026 | 12:10 PM

Suryakumar Yadav: టీమిండియా (Team India) మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కెరీర్‌లో ఎదురైన కష్టకాలం గురించి తొలిసారి మనసు విప్పాడు. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) విజయం తర్వాత భారత జట్టులో చోటు కోల్పోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు. అయితే ఆ పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడి మళ్లీ క్రికెట్‌పై ప్రేమ, ఆసక్తిని పెంచుకున్నానని వెల్లడించాడు. మంగళవారం ముంబైలో జరిగిన టీ20 ముంబై లీగ్ ఛాంపియన్స్ వేడుకలో పాల్గొన్న అతను తన అనుభవాలను పంచుకున్నాడు.

జట్టులో చోటు కోల్పోవడం బాధించింది..!

2026 మార్చి 8న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అంతకుముందు వరుసగా తక్కువ స్కోర్లతో నిరాశపరిచిన అతను చివరకు జట్టులో చోటు కోల్పోయాడు. ప్రపంచకప్ విజయం తర్వాత పరిస్థితులు కొంత కష్టంగా మారాయని సూర్య అంగీకరించాడు.

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

ఇవి కూడా చదవండి

టీమ్‌లో భాగం కాకపోవడం చాలా బాధించిందని, ఆ విషయాన్ని దాచిపెట్టాలని అనుకోవడం లేదని చెప్పాడు. మనతో మనం నిజాయితీగా లేకపోతే సంతోషంగా జీవించడం కష్టమని వ్యాఖ్యానించాడు.

కూతురు రాకతో మారిన పరిస్థితులు..

ఈ కష్టకాలంలో సూర్యకుమార్‌కు అతని కుటుంబం అండగా నిలిచింది. ముఖ్యంగా మే నెలలో తనకు కూతురు జన్మించడంతో ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరిగాయని చెప్పాడు. మొదటి రెండు నెలలు మానసికంగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ, ఆ తర్వాత క్రికెట్‌లోకి ఎలా వచ్చానో గుర్తు చేసుకున్నానని తెలిపాడు.

15 ఏళ్ల వయసులో ముంబై అండర్-15 జట్టుకు ఆడాలని కలలు కన్న రోజులను గుర్తుచేసుకున్నాడు. ఇదే విషయాన్ని భార్య దేవిషా శెట్టితో చర్చించగా, చిన్నప్పటి క్రికెట్‌పై ఉన్న ప్రేమ, పట్టుదలను తిరిగి తెచ్చుకోవాలని ఆమె సూచించిందట.

మళ్లీ పాత సూర్యలా మారేందుకు ప్రయత్నం..

భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని సూర్య తెలిపాడు. గతంలో ఎలా సాధన చేసేవాడో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ముంబై జట్టు కోసం మ్యాచ్‌లు గెలవడం, ఛాంపియన్‌షిప్ సాధించడంపైనే ఉందని స్పష్టం చేశాడు.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)లో ముంబై జట్టుకు సూర్య నాయకత్వం వహించనున్నాడు.

యువ ఆటగాళ్లకు సూర్య కీలక సూచన..

ఈ సందర్భంగా యువ క్రికెటర్లకు సూర్య ఓ ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. ఐపీఎల్‌లో (IPL) ఆడటమే మొదటి లక్ష్యం కాకూడదని సూచించాడు. ముందుగా ముంబై తరఫున వయసు విభాగాల క్రికెట్ ఆడాలని, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ స్థాయికి ఎదగాలని చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే ప్రతి యువ ఆటగాడి తొలి కల కావాలని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు రంజీ ట్రోఫీ (Ranji Trophy) తొలి విడతలో తనకు అవకాశం దక్కకపోవడంపై కూడా సూర్య పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2010-11లో ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ టెండూల్కర్, అమోల్ ముజుందార్, అజిత్ అగార్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నాడు.

మొత్తానికి జట్టులో చోటు కోల్పోయిన బాధ నుంచి బయటపడి, మళ్లీ తన పాత ఆటతీరును అందుకోవడమే లక్ష్యంగా సూర్య ముందుకు సాగుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us