Test Records: టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేశారుగా.. ఎక్కడో తెలుసా?

|

Jun 15, 2023 | 5:15 PM

County Championship: సర్రే ఐదు వికెట్ల తేడాతో కెంట్‌ను ఓడించి కౌంటీ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 500 కంటే ఎక్కువ పరుగులను ఛేదించిన రెండవ జట్టుగా అవతరించింది.

Test Records: టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేశారుగా.. ఎక్కడో తెలుసా?
County Championship
Follow us on

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. జూన్ 14 (బుధవారం)న కెంట్-సర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో కెంట్ జట్టు ఇచ్చిన 501 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ చరిత్రలో కెంట్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి 500 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా సర్రే జట్టు నిలిచింది. మొత్తంమీద, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది ఉమ్మడి 8వ అత్యధిక పరుగుల ఛేదనగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసింది. ఆ తర్వాత సర్రే తన తొలి ఇన్నింగ్స్‌ను కేవలం 145 పరుగులకే ముగించింది. కెంట్ రెండో ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసి 500 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇవి కూడా చదవండి

నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. కానీ, సర్రే బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. జట్టులో డోమ్ సిబ్లీ 140 నాటౌట్, జామీ స్మిత్ 114, ఫాక్స్ 124 పరుగులు చేశారు. ఓవరాల్‌గా సర్రే జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేసి లక్ష్యాన్ని సులభంగా చేరుకున్నారు.

ఫిబ్రవరి 2010లో సౌత్ జోన్‌పై వెస్ట్ జోన్ చేసిన 541 పరుగుల ఛేజింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా నిలిచింది. యూసుఫ్ పఠాన్ 190 బంతుల్లో 19 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులతో ఆ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ మొత్తం 4 వికెట్లు తీయగా.. కెంట్ తరపున ఆడుతున్న అర్షదీప్ చివరి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత విల్ జాక్వెస్‌ను వేటాడాడు. కౌంటీ క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎల్బీడబ్ల్యూ ద్వారా ఫాక్స్ తొలి వికెట్‌ను అర్షదీప్ పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..