KKR vs SRH: 23 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ ఘనవిజయం

19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘనవిజయం సాధించింది.

KKR vs SRH: 23 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ ఘనవిజయం
Srh

Updated on: Apr 14, 2023 | 11:33 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘనవిజయం సాధించింది. కోల్‌కతా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 229 పరుగుల టార్గెట్ నిలిచింది. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 20 ఓవర్లలో  205 పరుగులకు 7 కోల్పోయింది.

కోల్‌కతాపై హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుస వికెట్లు కోల్పోతూ కోల్‌కతా మ్యాచ్ లో తడబడింది. హైదరాబాద్‌ బౌలర్లు రాణించడంతో కోల్ కతా ఓటమి తప్పలేదు. రింకు సింగ్ 51,నితీశ్‌ రాణా 75 పరుగులతో రాణించారు.

హైదరాబాద్ బ్యాటింగ్ లో హ్యారీ బ్రూక్ 100 , ఐదెన్ మార్‌క్రమ్‌ 50, అభిషేక్ శర్మ 32, హెన్రిచ్‌ క్లాసెన్ 16 దూకుడుగా ఆడేశారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లోనే అత్యధికంగా 228/4 స్కోరు సాధించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us