AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ ఫీల్డింగ్‌పై ఛోటా ప్యాకెట్ సెటైర్లు.. ఒక్క కామెంట్‌తో హీటెక్కించిన ఇషాన్ కిషన్ లవర్..!

Ishan Kishan Instagram Post: పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్‌పై ఇషాన్‌ కిషన్ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ తెగ వైరలవుతోంది. అలాగే, ఇషాన్ కిషన్ లవర్ కూడా కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలాగే పంజాబ్ జట్టుపై గెలుపుతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందు నిలిచింది.

పంజాబ్ ఫీల్డింగ్‌పై ఛోటా ప్యాకెట్ సెటైర్లు.. ఒక్క కామెంట్‌తో హీటెక్కించిన ఇషాన్ కిషన్ లవర్..!
Ishan Kishan Lover
Venkata Chari
|

Updated on: May 07, 2026 | 12:57 PM

Share

Ishan Kishan Instagram Post: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ప్యాట్ కమిన్స్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, పంజాబ్ వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆట కంటే కూడా ఇషాన్ కిషన్ వేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేయగా, హెడ్ 19 బంతుల్లో 38 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఇషాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేయగా, క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులతో విరుచుకుపడ్డారు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.

పంజాబ్ చేజార్చిన అవకాశాలు..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ అత్యంత దారుణంగా సాగింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను పంజాబ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. 9 పరుగుల వద్ద కూపర్ కానోలీ, 18 పరుగుల వద్ద లాకీ ఫెర్గూసన్ క్యాచ్‌లు వదిలేయగా, 20 పరుగుల వద్ద వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ స్టంపింగ్ అవకాశాన్ని వదిలేశారు. అలాగే క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శశాంక్ సింగ్ జారవిడిచారు. ఈ తప్పిదాలే పంజాబ్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. లక్ష్య చేధనలో కానోలీ సెంచరీతో పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్ల వైఫల్యంతో పంజాబ్ లక్ష్యానికి దూరంగా ఆగిపోయింది.

సోషల్ మీడియాలో ఇషాన్ సెటైర్లు..

మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంటూ.. “నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి” (Catch me if you can) అనే క్యాప్షన్ ఇచ్చాడు. పంజాబ్ ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేయడాన్ని ఉద్దేశించే ఇషాన్ ఈ సెటైర్ వేశారని అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూసి ఇషాన్ కిషన్ ప్రియురాలు అదితి హుండియా ఆశ్చర్యపోయింది. “నీకు ఇలాంటి క్యాప్షన్లు ఎవరు ఇస్తున్నారు?” అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అగ్రస్థానంలో సన్ రైజర్స్..

ఈ గెలుపుతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందు నిలిచింది. ప్రస్తుతం క్లాసెన్ 490 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో నిలిచాడు. పాట్ కమిన్స్ నాయకత్వంలో జట్టు సమతూకంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న హైదరాబాద్, ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలో నిలిచింది. పంజాబ్ మాత్రం తమ ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోకపోతే టోర్నీలో ముందడుగు వేయడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us