IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న కీలక బ్యాట్స్‌మెన్.. కారణం ఏంటంటే?

|

Sep 24, 2021 | 4:01 PM

Sunrisers Hyderabad: ఈ క్రికెటర్ తొలిసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడుతున్నాడు. జానీ బెయిర్‌స్టో స్థానంలో వచ్చిన ఈ బ్యాట్స్‌మెన్.. ఐపీఎల్‌ నుంచి దూరమయ్యాడు.

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న కీలక బ్యాట్స్‌మెన్.. కారణం ఏంటంటే?
Sherfane Rutherford
Follow us on

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్‌మెన్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ టోర్నమెంట్‌ను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అతని తండ్రి కన్నుమూయడంతో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వీడాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2021 బయో బబుల్‌ను వదిలి ఇంటికి వెళ్తున్నాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ వెస్ట్ ఇండియన్ క్రికెటర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున తొలిసారి ఆడుతున్నాడు. జానీ బెయిర్‌స్టో స్థానంలో జట్టులోకి వచ్చాడు. దీనికి ముందు అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడించింది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ అతని కుటుంబానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కుటుంబం సంతాపాన్ని తెలియజేసింది. ‘షెర్ఫాన్ తండ్రి కన్నుమూశారు. ఈ కష్ట సమయంలో షెర్ఫాన్ కుటుంబంతో ఉండటానికి ఐపీఎల్ బయో బబుల్‌ని విడిచి వెళ్తున్నాడు. ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22 న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగింది. ఇందులో హైదరాబాద్ ఓడిపోయింది. రూథర్‌ఫోర్డ్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.

అప్పుడు ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్‌లో రెండో దశలో ఆడటం ఇదే మొదటిసారి. అతను ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 73 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2019 లోనే ఆ ఏడు మ్యాచ్‌లు ఆడాడు. అంతకుముందు అతడిని 2018 లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కానీ, ప్లేయింగ్‌ 11 లో అవకాశం ఇవ్వలేదు. అతను 2018 లోనే వెస్టిండీస్ జట్టులోకి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో టీ 20 తో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు మొత్తం ఆరు టీ 20 మ్యాచ్‌లు ఆడి, 43 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గడ్డు దశలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇంకా ఆడటానికి అందుబాటులోకి రాలేదు. జానీ బెయిర్‌స్టో ఆడడం లేదు. అలాగే టి నటరాజన్‌కు కరోనా వచ్చింది. విజయ్ శంకర్ కూడా క్వారంటైన్‌లో ఉన్నాడు.

Also Read: Rohit Sharma: దేవుడితో ఏం మాట్లాడతామంటూ అభిమాని భావోద్వేగం.. ఫిదా అయిన రోహిత్ శర్మ.. బహుమతిగా ఏమిచ్చాడంటే?

IPL 2021: తొలి రెండు మ్యాచుల్లో బౌండరీల భీభత్సం.. కోహ్లీ, రోహిత్‌లకు చుక్కలు.. 26న ధోని టీంకు దబిడ దిబిడే అంటోన్న గంగూలీ శిష్యుడు