AUS vs NZ Final: ఆ జట్టే విజయం సాధిస్తుంది.. ఎందుకో చెప్పిన సునీల్ గవాస్కర్..

|

Nov 14, 2021 | 12:19 PM

టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీ ఆధ్యంతం న్యూజిలాండ్ తమ ఆటతీరుతో ఆకట్టుకుంది....

AUS vs NZ Final: ఆ జట్టే విజయం సాధిస్తుంది.. ఎందుకో చెప్పిన సునీల్ గవాస్కర్..
Sunil Gavaskar
Follow us on

టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీ ఆధ్యంతం న్యూజిలాండ్ తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని కంగారుస జట్టు అంచనాలకు మించి ఎన్నో రెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. క్రికెట్ గణాంకాలు ఆస్ట్రేలియాదే పైచేయి కనిపిస్తోంది. కానీ కేన్ విలియమ్సన్ జట్టు ఇటీవలి ఫామ్‌ను కూడా విస్మరించలేం. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఏ జట్టు చరిత్ర సృష్టిస్తుందో చెప్పడం చాలా కష్టం. అయితే భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైనల్‎లో ఎవరు గెలుస్తారు అంచనా వేశాడు.. టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్‎లో ఆస్ట్రేలియా గెలిచే అకాశం ఉందన్నాడు. ఆస్ట్రేలియా 2010 సంవత్సరంలో నెరవేరని కలను సాకారం చేసుకోగలుగుతుందని చెప్పాడు.

టీ20 ప్రపంచ కప్ గెలవడానికి తన ఫెవరేట్ జట్టు ఆస్ట్రేలియా అని గవాస్కర్ చెప్పాడు. కంగారుల జట్టు చాలాసార్లు న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించిందని గుర్తు చేశారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు 14 సార్లు తలపడ్డాయి. అందులో 9 సార్లు ఆసీస్ జట్టు గెలుపొందగా, నాలుగింటిలో మాత్రమే కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 64.28 శాతం సక్సెస్ రేటు ఉంది. అయితే టీ20 వరల్డ్, వన్డే వరల్డ్ కప్‎ల్లో పాకిస్తాన్‎పై ఇండియాదే పై చేయి కానీ.. సూపర్-12 జరిగిన మ్యాచ్‎లో భారత్ పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

సెమీ ఫైనల్స్‌లో టైటిల్ కోసం అగ్రశ్రేణి పోటీదారులుగా పరిగణించబడుతున్న ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించగా, ఆస్ట్రేలియా పాకిస్తాన్ కలను ఛేదించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌కు చేరుకోవడంలో న్యూజిలాండ్ విజయవంతమైంది. విలియమ్సన్ అండ్ కో ఈ అవకాశాన్ని వృథా చేయకూడదనుకుంటున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియా అంతకుముందు 2010 సంవత్సరంలో ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇంగ్లాండ్ కంగారులను ఓడించి కప్ ఎగురేసుకెళ్లింది.

Read Also.. MS Dhoni: ధోనీ ఫొటో పోస్ట్ చేసిన WWE సూపర్ స్టార్ జాన్ సెనా.. ఎందుకంటే..