
Steve Smith 100 off 42 balls: బిగ్ బాష్ లీగ్ 37వ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో థండర్ జట్టు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని సిక్సర్స్ ముందు ఉంచింది.
42 బంతుల్లోనే సెంచరీ.. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌కు స్టీవ్ స్మిత్ కనీవినీ ఎరుగని ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడిన స్మిత్, కేవలం 42 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్మిత్ మొత్తం 5 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 238.09 గా నమోదు కావడం విశేషం.
#SteveSmith ‘s insane 100 off 41 balls that included,
– 9 sixes
– 32 runs in one over
– 4 sixes in a row
– 107-metre six
– 141-run partnership with #BabarAzam pic.twitter.com/T3EpFdIdrD— lightningspeed (@lightningspeedk) January 16, 2026
ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏంటంటే.. స్మిత్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదిన స్మిత్, ఆ తర్వాత ఫోర్ కొట్టాడు. నో బాల్, వైడ్ రూపంలో వచ్చిన పరుగులతో కలిపి ఆ ఓవర్ BBL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.
మరోవైపు సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నిలకడగా ఆడినప్పటికీ, వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. 39 బంతుల్లో 47 పరుగులు చేసిన బాబర్, నాథన్ మెక్‌ఆండ్రూ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ సునామీ ముందు బాబర్ ఇన్నింగ్స్ వెలవెలబోయింది.
స్మిత్ విధ్వంసంతో సిడ్నీ సిక్సర్స్ జట్టు మరో 16 బంతులు మిగిలి ఉండగానే 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిక్సర్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వార్నర్ సెంచరీ వృధా అయినప్పటికీ, స్మిత్ వీరబాదుడు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..