T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది.. బోర్డు నిబంధనతోనే ఇబ్బంది: లసిత్ మలింగ

|

Jun 29, 2021 | 5:15 PM

ఈ ఏడాది అక్టోబరులో యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు.

T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది.. బోర్డు నిబంధనతోనే ఇబ్బంది: లసిత్ మలింగ
Lasith Malinga
Follow us on

Lasith Malinga: ఈ ఏడాది అక్టోబరులో యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు గతేడాది తీసుకొచ్చిన ఓ రూల్‌ తో మలింగ కు మైనస్‌గా మారింది. 2కిమీ ఫిట్‌నెస్ టెస్టు పాసయితేనే జట్టులో చోటు దక్కనుంది. 37ఏళ్ల మలింగ కు ఈ నిబంధనతో టీ20ల్లోనూ కెరీర్‌ క్లోజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. చివరిగా మార్చి, 2020లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

ఈమేరకు ఆయన మాట్లాడుతూ, ‘‘నేను ఇప్పటికీ టీ20ల్లో పూర్తి ఓవర్లు వేయగలను. కానీ.. బోర్దు తీసుకొచ్చిన 2కిమీలు మాత్రం పరుగెత్తలేను. అందుకే ఇంట్లో ఉన్నాను. కేవలం 24 బంతులే కాదు.. రెండు గంటలు కూడా బౌలింగ్ చేయగలను. 35 ఏళ్ల వయసులో కివీస్‌పై వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీశాను. అప్పుడు నా ఫిట్‌నెస్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటికీ 200 బంతులను ఒకే స్పీడ్‌తో వేయగలను. ఇప్పట్లో రిటైర్మెంట్ చేసే ఆలోచనైతే చేయడం లేదని’’ మలింగ పేర్కొన్నాడు.

మరోవైపు ఇంగ్లాండ్ టూర్‌ లోఉన్న శ్రీలంక జట్టు మూడు టీ20ల్లో ఓడిపోయింది. అతి తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరి మూడు టీ20లను చేజర్చుకుంది. దీంతో మాజీలంతా విమర్శలు చేస్తున్నారు. టీం పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని గాడిలో పెట్టాలని కోరుతున్నారు. లేదంటే త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. దాంతో.. టీ20 ప్రపంచకప్ జట్టులో మలింగ ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఎలా ఆడతారో చూడాలి. కాగా, ఇప్పటికే ఓటమితో దెబ్బ తిన్ ఆ జట్టుకు.. మరో షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లు కుశాల్‌ మెండిస్‌, వికెట్‌ కీపర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా, ఓపెనర్‌ దనుష్క గుణతిలక బయోబబుల్‌ దాటి బయటకు వెళ్లారు. స్థానిక వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో.. శ్రీలంక బోర్డు ఈ ముగ్గురి ఆటగాళ్లపై వన్డేలు ఆడకుండా నిషేధం విధించింది. అలాగే విచారణకు ఆదేశిస్తూ.. స్వదేశం చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

T20 World Cup: అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌.. ఐసీసీ ప్రకటన!

IPL 2022: కొత్త ఫ్రాంచైజీల కనీస విలువ రూ.2000 కోట్లు..! జులైలో విక్రయానికి రెడీ?

ఇంగ్లండ్ వీధుల్లో టీమిండియా ఉమెన్స్‌.. ఆటలోనే కాదు అందంలోనూ పోటీపడుతోన్న మిథాలీ సేన!