Bhanuka Rajapaksa: ‘మా దేశాన్ని ఆదుకోండి’.. లంక క్రికెటర్‌ భానుక రాజపక్స విజ్ఞప్తి..

|

May 09, 2022 | 6:19 PM

శ్రీలంక(Srilanka)లోని దయనీయ పరిస్థితిపై ఆ దేశ క్రికెటర్లు స్పందిస్తున్నారు. తమ దేశానికి సాయం చేయాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు...

Bhanuka Rajapaksa: మా దేశాన్ని ఆదుకోండి.. లంక క్రికెటర్‌ భానుక రాజపక్స విజ్ఞప్తి..
Rajapaksa
Follow us on

శ్రీలంక(Sri lanka)లోని దయనీయ పరిస్థితిపై ఆ దేశ క్రికెటర్లు స్పందిస్తున్నారు. తమ దేశానికి సాయం చేయాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో ఆడుతున్న ఆ దేశ ఆటగాళ్లు తమ దేశ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న లంక బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే(Bhanuka Rajapaksa).. ప్రపంచ దేశాలను సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మే 9 సోమవారం, రాజధాని కొలంబోలో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి మహింద రాజపక్సే నివాసం వెలుపల తీవ్ర ప్రదర్శన జరిగింది. దేశ పరిస్థితికి ప్రధానమంత్రి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ఆందోళనకారులు గట్టిగా నిలదీశారు. అయితే కొంతసేపటికి ప్రధాని రాజపక్సే మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళనకారులపై దాడి చేశారు. ఈ హింసాకాండలో 23 మంది నిరసనకారులు గాయపడ్డారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నివాసం వెలుపల భద్రతను మరింత పెంచారు. రాజధాని కోలంబోలో కర్ఫ్యూ విధించారు.

భానుక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హింస సంబంధించి ఫొటోను పోస్ట్ చేశాడు. భానుక రాజపక్సే ఈ ఏడాది జనవరిలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే కొన్ని గంటల తర్వాత అతను తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ను పంజాబ్ కింగ్స్ వేలంలో రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. రాజపక్సే తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. అతను 7 ఇన్నింగ్స్‌లలో 166 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ హింసాకాండ జరిగిన కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకు ప్రధాని రాజపక్సే రాజీనామా చేశారు. నిరసనలు, హింసాకాండపై స్పందిస్తూ.. ప్రజలు సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని అన్నారు. శ్రీలంకలో పరిస్థితి క్షీణించడంతో, కొద్ది రోజుల క్రితం, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

Read Also..  IPL 2022: బరిలోకి దిగేముందు బ్యాట్ కొరుకుతున్న ధోనీ.. అసలు విషయం ఇదేనన్న మాజీ స్పిన్నర్..